వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?

అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది.    Also Read: మరో వివాదంలో ఇరుక్కున సీఎం జగన్? ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, […]

Written By: NARESH, Updated On : September 26, 2020 2:28 pm
Follow us on


అది 2019 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అందరూ ఎవరికి వారుగా ప్రచారంలో మునిగిపోయారు. జగన్‌ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కానీ.. అంతలోనే విషాదం. అది మార్చి 15. మాజీ మంత్రి, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోయారు. ముందుగా గుండె పోటుతో చనిపోయాడని అందరూ అనుకున్నా.. తర్వాత అది హత్యగా తేలింది. 
 

Also Read: మరో వివాదంలో ఇరుక్కున సీఎం జగన్?

ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ.. నిందితులు మాత్రం దొరకలేదు. తాజాగా.. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ  వచ్చింది. తాజాగా సీబీఐ విచారణలో కీలక విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం.

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇద్దరు మహిళల ద్వారా సీబీఐ సేకరించినట్లు సమాచారం. తాజాగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు.. పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళలతోపాటు చెప్పుల షాప్ లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఆ చెప్పుల వ్యాపారి మున్నాను ఆరాతీశారు. మున్నా ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయన బ్యాంకు లాకరులో భారీ మొత్తంలో నగదును సీబీఐ అధికారులు గుర్తించారు. మూడు రోజుల క్రితం మున్నాను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇక వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటి ముందురోజు కాణిపాకం ఎందుకు వెళ్లాడనే దానిపై ఆయన ఇంట్లో పనిచేసే రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. కాణిపాకంలోనూ విచారణ జరిపారు. దీంతో వైఎస్ వివేకాకు సంబంధించిన హత్య కేసు గుట్టులో కీలక సమాచారం దొరికినట్టు ప్రచారం సాగుతోంది.

Also Read: అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

ఆ ఇద్దరు మహిళలు, చెప్పుల షాపు యజమాని మున్నా, భాస్కర్ రెడ్డి ద్వారా వైఎస్ వివేకా హత్య కేసులో కీలక కోణాన్ని సీబీఐ అధికారులు సేకరించినట్లు ప్రచారం సాగుతోంది. కాణిపాకం ఎందుకు వెళ్లాడనేది నిర్ధారించుకునేందుకు వైఎస్ వివేకా ఇంట్లో పనిచేసే రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని ఇటీవల సీబీఐ అధికారులు కాణిపాకం వెళ్లారు. అక్కడ కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ కేసు చిక్కుముడి విడిపోయేలా ఉన్నట్టు తెలుస్తోంది.