Raj ex-wife comments: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సమంత(Samantha Ruth Prabhu), రాజ్ నిడిమోరు(Raj Nidimoru) పేర్లే వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది?, నాగ చైతన్య కి విడాకులు ఇవ్వడానికి కారణం ఈ బంధమేనా?, ఇలా ఎన్నో రకాల అనుమానాలతో సోషల్ మీడియా లో విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సమంత ఇలాంటి వార్తలను సీరియస్ గా తీసుకునేది. విడాకులు జరిగిన కొత్తల్లో ఈమె తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై హై కోర్టు లో కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్స్ కూడా వేసింది. ఆ రేంజ్ కి వెళ్లిన సమంత, ఇప్పుడు మాత్రం నెగిటివిటీ ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం పాజిటివిటీ ని మాత్రమే తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇది నిజంగా శుభ పరిణామమే అని చెప్పొచ్చు.
ఇక సమంత పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా లో శుభాకాంక్షల వెల్లువ కురిపించారు నెటిజెన్స్. అదే విధంగా పూనమ్ కౌర్ లాంటి హీరోయిన్స్ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలిదే కాసేపటి క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాపై ప్రేమ, మద్దతు, అభిమానం చూపిస్తున్న ప్రతీ ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి. ఇటీవల కాలం లో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, అటు ఇటు తిరుఇగుతూ, వాదించుకుంటూ గొడవలు పడిన రోజులు ఉన్నాయి. గత ఎలా 9న నా జ్యోతిష్య గురువుకి క్యాన్సర్ నాల్గవ స్టేజిలో ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో నేను మరింత మానసిక ఒత్తిడికి గురయ్యాను. నాకు ఎలాంటి పీఆర్ టీం లేదు, ఇప్పుడు కూడా స్వయంగా నేను ఈ విషయాన్ని తెలుపుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామిలిదే.
విషయం లోకి వెళ్తే రాజ్ నిడిమోరు తన మాజీ భార్య శ్యామిలీ దే కి విడాకులు ఇచ్చి సమంత ని పెళ్లి చేసుకోవడం పై కొంతమంది తప్పుబడుతూ, శ్యామిలీ పై జాలి, అభిమానం చూపించారు నెటిజెన్స్. దాన్ని ఉద్దేశించి ఆమె ఇలాంటి కామెంట్స్ చేసింది. అప్పుడప్పుడు శ్యామిలీ వాళ్ళిద్దరి బంధం పై పరోక్షంగా సెటైర్లు వేయడం, శాపనార్థాలు పెట్టడం వంటివి చేసింది. సమంత, రాజ్ పెళ్లి చేసుకున్న రోజు కూడా కర్మ ఎవరినీ వదిలిపెట్టదు, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చింది. చూస్తుంటే ఈ ముగ్గురి మధ్య చాలా పెద్ద గొడవే జరిగినట్టుగా చూసేవాళ్లకు అనిపిస్తోంది.