Tamil language in danger: తమిళనాడులో డీఎంకే, ఏఐడీంకేతోపాటు కొత్తగా హీరో విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ కూడా తరచూ తమిళ జపం చేస్తుంది. తమిళాన్ని ఎవరు ఏమన్నా మండిపడతారు. తరచూ తమిళ భాష, తమిళ సంస్కృతి అంటూ గొప్పలు చెప్పుకుంటారు. ఇదే స
మయంలో హిందీని వ్యతిరేకిస్తున్నాయి.కానీ ఇప్పుడు తమిళ భాష ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
మొదట పనికిమాలన బాష అని..
జస్టిస్ పార్టీ ప్రారంభ సమయంలో తమిళాన్ని ‘పనికిమాలిన భాష‘గా తక్కుచేశారు. తర్వాత ప్రాంతీయవాదం బలపడిన తర్వాత భాషా గొప్పతనాన్ని ప్రధాన్యత చేశాయి. ఈ మలుపు రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. తమిళ సెంటిమెంటుతోనే రాజకీకం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తమిళ భాషకు ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
ఉపాధ్యాయ పరీక్షలో..
తమిళనాడు టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉపాధ్యాయుల భర్తీ పరీక్షలో 85 వేల మంది తమిళ భాషా పరీక్షలో ఫెయిల్ అయ్యారు. 50 మార్కులకు 20 మార్కులు (40%) పాస్ మార్కులు కాగా, ఈ అభ్యర్థులు అవి కూడా సాధించలేదు. ఇది భాషా ప్రావీణ్యంలో లోపాలను బయటపెట్టింది.
భాష పేరుతో రాజకీయమే..
డీఎంకే వంటి పార్టీలు తమిళ సంస్కృతి రక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకుంటున్నాయి. అయితే పరీక్ష ఫలితాలు భాషా శిక్షణ, పాఠ్యాంగ సమస్యలను సూచిస్తున్నాయి. ద్రావిడ వాదం భాషా గొప్పతనాన్ని ప్రచారం చేసినా, ఆచరణలో లోపాలు బయటపడ్డాయి.
తమిళ భాషా ప్రావీణ్యం పెంచేందుకు పాఠశాలల్లో మెరుగైన శిక్షణ, డిజిటల్ టూల్స్ అవసరం. రాజకీయ ప్రచారాలకు మించి విద్యా సంస్కరణలు చేపట్టాలి. ఈ ఫలితాలు భాషా విధేయతపై కొత్త చర్చలకు దారితీస్తాయి.