Rajinikanth Daughter: తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్న అంశం పై రజిని స్పందించినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రజిని ధనుష్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ధనుష్ – ఐశ్వర్య ఇద్దరితో రజిని మాట్లాడాడట. 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని చిన్న ఇగోతో పాడు చేసుకోవద్దు అని, అయినా ఎందుకు సడెన్ గా మీ బంధానికి ముగింపు పలుకుతున్నారో ? ఒకసారి మీరే ఆలోచించుకోవాలని రజిని క్లాస్ తీసుకున్నారట.
నిజానికి ధనుష్ తో ఐశ్వర్య పెళ్ళికి రజినీకాంత్ ముందు అంగీకరించలేదట. కూతురు నిజంగానే ధనుష్ ను ప్రేమిస్తోంది అని, ఆయన వీరి పెళ్ళికి ఒప్పుకున్నారు. ధనుష్ కూడా ముందు నుంచి చాలా సాఫ్ట్. పైగా ఐశ్వర్య కూడా ధనుష్ ను ప్రేమించింది. అందుకే.. రజిని వీరి పెళ్లిని ఒప్పుకోవాల్సి వచ్చింది. పెళ్లి అయిన దగ్గర నుంచి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు.
Rajinikanth and his Daughter
Also Read: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ బాగుంది !
కాకపోతే.. వీరి మధ్య ఓ టాపిక్ ఎప్పటి నుంచో అడ్డుగోడగా నిలుస్తూ వస్తోందట. గతంలో కూడా ఇదే అంశం పై రజినీకాంత్, ధనుష్ ను సున్నితంగా హెచ్చరించాడు కూడా. అది కూడా ధనుష్ కి నచ్చలేదు అని, తన పర్సనల్ విషయాలను ఐశ్వర్య పెద్దలు ముందు పెట్టడం ధనుష్ కి నచ్చలేదు అని.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని.. ఇక ఆ గొడవలు పెరిగి ఇద్దరూ విడిపోయారని తెలుస్తోంది.
ఏది ఏమైనా రజినీకాంత్ వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడినట్లు తెలుస్తోంది. ధనుష్ తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. అప్పటి నుంచి రజిని ధనుష్ కి చాలా రకాలుగా అండగా నిలబడ్డాడు.
Also Read: విశాల్ ‘సామాన్యుడు’ కి యు/ఏ సర్టిఫికేట్ !