Ashoka Vanam Lo Arjuna Kalyanam Teaser: యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ లో పెళ్లి కోసం హీరో పడే పాట్లు, ఇబ్బందులను చాలా కామెడీగా ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. అలాగే టీజర్ ఎండింగ్ లో ఎమోషన్ కూడా బాగానే హైలైట్ అయింది.
Ashoka Vanam Lo Arjuna Kalyanam Teaser
మొత్తానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ బాగుంది. సినిమా పై అంచనాలను పెంచింది. ఇక బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. అన్నట్టు హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా కరోనా వ్యాధికి గురై.. చికిత్స తీసుకుని బయట పడిన సంగతి తెలిసిందే.
Ashoka Vanam Lo Arjuna Kalyanam Teaser
Also Read: విశాల్ ‘సామాన్యుడు’ కి యు/ఏ సర్టిఫికేట్ !
కరోనా పాజిటివ్ రాకముందు గత కొన్ని రోజులుగా విశ్వక్‌సేన్ షూటింగ్ లో పాల్గొన్నాడు. పైగా కరోనా అని తేలింది కూడా ఈ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా షూటింగ్ స్పాట్ లోనే. దాంతో ఈ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు. అందుకే.. సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కొంత టైమ్ పట్టింది. అయితే, ఐసోలేషన్ లోనే చిత్రబృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది.
అందులో భాగంగానే ఈ రోజు ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసింది. టీజర్ బాగుంది కాబట్టి సినిమా పై అంచనాలు పెరిగాయి.
Also Read: ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న మోహన్ బాబు, బ్రహ్మానందం !