Ravi Teja Naveen Polishetty Multi Starrer: మన టాలీవుడ్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) కచ్చితంగా టాప్ 3 లిస్ట్ లో ఉంటాడు. మాస్ కామెడీ అయినా, డీసెంట్ కామెడీ అయినా రవితేజ కామెడీ లో ఉండే టైమింగ్ వేరు. ఆయన్ని రీప్లేస్ చేసే వాళ్ళు రావడం కష్టం అని అంతా అనుకుంటున్న సమయంలో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) వచ్చాడు. ఇండస్ట్రీ లో ఈమధ్య కాలం లో వచ్చిన యంగ్ హీరోలు బాగా సక్సెస్ అయ్యారు. కానీ ఎవరికీ కూడా నవీన్ పోలిశెట్టి కి ఉన్నంత కామెడీ టైమింగ్ లేదు. అసలు నవీన్ కి స్క్రిప్ట్ అక్కర్లేదు. తనకు సందర్భం చెప్తే చాలు, డైలాగ్స్ తో సహా పొట్టచెక్కలు అయ్యే రేంజ్ కామెడీ ని పండిస్తాడు. ఇలాంటి టాలెంట్ మన టాలీవుడ్ లో దొరకడం చాలా అరుదు అనే చెప్పాలి.
Also Read: రవితేజ ‘మాస్ జాతర’పై నీలినీడలు: మరో రొటీన్ సినిమానా? అందుకే ప్రమోషన్ పక్కన పెట్టారా?
అలాంటి కామెడీ కింగ్స్ అయినటువంటి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక మల్టీస్టార్రర్ చేస్తే ఎలా ఉంటుంది?, బాక్స్ ఆఫీస్ బద్దలే కదూ. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ధమాకా మూవీ రచయితా ప్రసన్న కుమార్ కి వచ్చింది. రీసెంట్ గానే ఆయన ఈ ఇద్దరు హీరోలను కలిసి ఈ స్టోరీ ని వినిపించాడు. ఇద్దరికీ తెగ నచ్చేసింది. వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అట. ప్రసన్న కుమార్ స్వయంగా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు , మరి కొందరు మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కానీ కళ్యాణ్ కృష్ణ అంటే నవీన్ పోలిశెట్టి కి ఇష్టం లేదు. ఆయన హీరో గా చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అనగనగ ఒక రాజు’ చిత్రానికి మొదట్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, డైరెక్టర్ ని మారిస్తేనే ఈ సినిమా చేస్తానని నిర్మాత నాగవంశీ తో చెప్పాడట. అలా కళ్యాణ్ కృష్ణ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ రవితేజ తో కలిసి చేస్తున్నాడు కాబట్టి, ఆయన కోసం కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరికొకరు పోటీ పడి మరీ నవ్వులు పూయించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతోంది అనేది.