ఈ సూపర్ స్టార్లు రాష్ట్రాన్ని పాలించలేరా ?

తమిళ్ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా సూపర్ స్టార్ లుగా వెలిగిపోతున్న ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా ఒకటై.. ఒకే ఏజండాతో ముందుకుపోతే.. ఆ ప్రభావం స్టేట్ మీద ఖచ్చితంగా ఉంటుందనేది ఖచ్చితత్వంతో చెపొచ్చు. పైగా గతంలో కలిసి మల్టీ స్టారర్ లు చేసిన వీరిద్దరూ, ఇప్పుడు కలిసి రాజకీయంగా ఎదిగే అవకాశాలు తమిళనాట కనిపిస్తుండటంతో.. కరోనా కాలంలో అక్కడి ప్రభుత్వం వైఫల్యం ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలకు కలిసి వస్తుంది. వాళ్లే కమల్ హాసన్, రజిని కాంత్.. […]

Written By: admin, Updated On : July 8, 2020 7:17 pm
Follow us on


తమిళ్ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా సూపర్ స్టార్ లుగా వెలిగిపోతున్న ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా ఒకటై.. ఒకే ఏజండాతో ముందుకుపోతే.. ఆ ప్రభావం స్టేట్ మీద ఖచ్చితంగా ఉంటుందనేది ఖచ్చితత్వంతో చెపొచ్చు. పైగా గతంలో కలిసి మల్టీ స్టారర్ లు చేసిన వీరిద్దరూ, ఇప్పుడు కలిసి రాజకీయంగా ఎదిగే అవకాశాలు తమిళనాట కనిపిస్తుండటంతో.. కరోనా కాలంలో అక్కడి ప్రభుత్వం వైఫల్యం ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలకు కలిసి వస్తుంది. వాళ్లే కమల్ హాసన్, రజిని కాంత్.. తమిళ వెండితెరను ఏలుతున్న ఈ హీరోలు రాష్ట్రాన్ని పాలించలేరా ? ఒకే సమయంలో హీరోగా కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాలలో కనిపించి అలరించారు. అలా హీరోలుగా కలిసి ఎదిగిన వీరు, ఇప్పుడు రాజకీయంగా కూడా కలిసి ఎదగాలని చూస్తే తప్పు ఏమిటి ? అని తమిళ్ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ పోస్ట్ లు పుట్టుకొస్తున్నాయి.

నిజానికి గత కొన్ని నెలలుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నా.. వాటి పై ఇన్నాళ్లు తమిళ్ మీడియా ఫోకస్ చేయలేదు. చేసినా హైలైట్ అయ్యేలా చేయలేదు. అయితే కరోనా వచ్చాక.. ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ మధ్య ఒక్కసారిగా బయటకు వస్తోంది. దాంతో ప్రజలు అభిమానులు స్టార్ల వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరోనాకి ముందు జరిగిన కొన్ని కార్యక్రమాలలో కమల్, రజిని అనేక
సార్లు కలిశారు. పైగా కమల్ హాసన్ కి చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ నూతన భవనం ఎదురుగా వీరిద్దరి గురువుగారైన కె బాలచందర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలోనూ.. కమల్ 60ఏళ్ల సినీ వేడుకలోనూ.. రజిని చేసిన హడావుడి పై అప్పట్లో ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. కమల్ రజినీ బంధం గురించి అభిమానుల్లో ఉన్న అనుమానాలు కూడా తొలిగిపోయాయి. లాక్ డౌన్ పెట్టకముందు వరకూ రజిని ఇంటికి స్వయంగా కమల్ వెళ్లి రాజకీయ పరిస్థితులు గురించి చర్చలు కూడా జరిపారట.

మొత్తానికి రానున్న ఎన్నికలలో కమల్ రజినీ కలిసి పనిచేస్తే.. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్త ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నిటికిమించి తమిళ ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే మునుపటిలా పటిష్టంగా లేవనేది తమిళ సోషల్ మీడియాలో వస్తోన్న వాస్తవ కథనాలు. ఇదే సరైన సమయం, కమల్, రజిని వేరువేరుగా కాకుండా సమిష్టిగా కలిసి ముందుకు వెళ్తే.. లక్ష్యాన్ని అందుకోవడం అంత కష్టమైన పని కాదనేది.. జయలలిత విజయపరంపర చూస్తే అర్ధమవుతుంది. చూడాలి మరి కమల్ రజినీ ఏమి చేస్తారో..!