Site icon OkTelugu

Budget 5G Smartphone: మొబైల్ తో వర్క్ చేసే వారికి ఇదే బెస్ట్ ఫోన్.. ధర 20 వేల లోపు..

Budget 5G Smartphone

Budget 5G Smartphone

Budget 5G Smartphone: ప్రముఖ మొబైల్ కంపెనీ Vivo అప్డేట్ మొబైల్స్ తో వినియోగదారులను అలరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ తో ఆకట్టుకున్న ఈ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త మొబైల్ లో కెమెరా పనితీరుతో పాటు, బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేటి యూత్ తో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకు అవసరమయ్యే ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ మొబైల్స్ లో ఉన్న ఫీచర్లో ఏవో ఇప్పుడు చూద్దాం..

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

ఇటీవల మార్చి 17వ తేదీన Vivo కంపెనీ నుంచి T5 x 5G మొబైల్ రిలీజ్ అయింది. ఇందులో ప్రధానంగా డిస్ప్లే గురించి చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 6.72 అంగుళాల LCD డిస్ప్లేను అమర్చారు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. మూవీస్ చూసేవారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే పై ప్రత్యేకంగా రక్షణతో గొరిల్లా గ్లాస్ ఉండనుంది. ఇందులో ప్రాసెసర్ కూడా సమర్థవంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ఉండడంతో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ను సెట్ చేశారు. వీటితోపాటు 8GB రామ్, 128 GB స్టోరేజ్ ఉండడంతో ఈ ఫోన్ వేగంలో దూసుకుపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోజువారి వినియోగదారులతో పాటు ఒకేసారి పది రకాల యాప్స్ ఉపయోగించిన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

వివో కొత్త ఫోన్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో విషయం కెమెరా. ఇప్పటికే ఎన్నో రకాల వివో ఫోన్లు కెమెరా ను ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఇప్పుడు కొత్త మొబైల్ T5 x 5G లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 2 MP టెలిఫోటో తో పని చేస్తుంది.8 MP ఫ్రంటు కెమెరా తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ వీడియో కాలింగ్ క్వాలిటీ గా ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇందులో బ్యాటరీ కూడా సమర్థవంతంగా ఉంచారు.7200 mAh బ్యాటరీ ఉండగా ఇది 44 W సపోర్టుతో ఫాస్టెస్ట్ చార్జింగ్ కానుంది. వీటితోపాటు ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్ సి పోర్టు, 5జి నెట్వర్క్ సపోర్టు వంటి ఫీచర్లు ఉన్నాయి.

అయితే ఇన్ని ఫీచర్లో ఉన్న ఈ మొబైల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ధర ఉంది. దీనిని రూ.15,000 నుంచి రూ.20,000 లోపు విక్రయిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి రావడంతో చాలామంది ఈ మొబైల్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

Exit mobile version