Rajinikanth Kamal Haasan Multistarrer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నెల్సన్ డైరెక్షన్ లో వీళ్ళిద్దరు సినిమా చేస్తున్నారంటూ ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. అది అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులందరికి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరిగిపోయాయి. ప్రస్తుతం నెల్సన్ రజనీకాంత్ తో ‘జైలర్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రజనీకాంత్ కమల్ హాసన్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తను ఇప్పటివరకు చేసిన సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాను మాత్రం సూపర్ హిట్ గా నిలపాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇంతకుముందు ఆయన చేసిన ‘జైలర్’ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది రజినీకాంత్ కెరియర్ లోనే అత్యధిక బజ్ ను క్రియేట్ చేసిన సినిమాగా ఇండస్ట్రీలో ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసుకుంది.
ఇక అలాంటి నెల్సన్ ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ లో ఇమేజ్ ను బాలన్స్ చేస్తూ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేయాలని గతంలో చాలామంది దర్శకులు అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి సైతం వీరిద్దరితో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు..కానీ అది కార్యరూపం దాల్చలేదు… మరి ఇప్పుడు నెల్సన్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
ప్రేక్షకులకు అలాగే వాళ్ళ అభిమానులను సాటిస్ఫై చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమా సక్సెస్ సాధిస్తే రజనీకాంత్ – కమల్ హాసన్ ల ఇమేజ్ మరోసారి తారా స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…