Dhurandhar 2 Telugu Collections Drop Reason: భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని ఆదరించే ప్రేక్షకులు ఇండియా లో ఎవరైనా ఉన్నారా అంటే, అది తెలుగు ఆడియన్స్ మాత్రమే. మంచి సినిమాలను ఎవరు చేసినా ఆదరిస్తారు. హీరో పెద్దగా తెలుగు ఆడియన్స్ కి తెలియకపోయినా సరే, కాసుల వర్షం కురిపిస్తూ ఉంటారు. రీసెంట్ గా ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) తెలుగు లో విడుదలైంది. మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే మొదటి వీకెండ్ తర్వాత ఈ చిత్రం జోరు ఊహించినంత రేంజ్ లో లేదనే చెప్పాలి. వర్కింగ్ డేస్ లో భారీగా వసూళ్లు పడిపోయాయి. శనివారం రోజున ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
ఓవరాల్ గా ఆఫ్ లైన్ గ్రాస్ వసూళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటే శనివారం రోజున ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ నుండి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు లో ఈ చిత్రం రెండు రోజుల ఆలస్యం గా విడుదలైంది. కాబట్టి 8 రోజుల వసూళ్లుగా వీటిని పరిగణించొచ్చు. ఇది కచ్చితంగా మంచి వసూళ్లు అనే చెప్పొచ్చు. కానీ, మొదటి వీకెండ్ లో ఉన్న ఊపుని చూసిన ప్రతీ ఒక్కరు ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ నుండి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సినిమా వసూళ్లు తెలుగు లో డ్రాప్ అవ్వడానికి ప్రధాన కారణం, ఫ్యామిలీ ఆడియన్స్ కొరవ అవ్వడం వల్లే.
ఏ సినిమాకు అయినా లాంగ్ రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యం. కానీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం యూత్ ఆడియన్స్ సపోర్టు తో నడుస్తోంది. అందుకే అనుకున్న టార్గెట్ కి ఈ చిత్రం చేరుకోవడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగు వెర్షన్ గురించి పక్కన పెడితే, తమిళ వెర్షన్ నుండి ఈ చిత్రం 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా డబ్బింగ్ బాషల నుండి ఈ చిత్రం 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి 1186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో రాబోయే రోజుల్లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.