Rajinikanth Kamal Haasan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తమ స్వశక్తితో కష్టపడి సంపాదించుకున్న ప్రతి పాత్రతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్న వాళ్లలో రజనీకాంత్, కమల్ హాసన్ లు మొదటి స్థానంలో ఉంటారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రతి ఒక్క తమిళ్ ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరు తమిళ్ ఇండస్ట్రీ కి రెండు కండ్ల లాంటివారు. చాలా సంవత్సరాల నుంచి వీళ్లు కలిసి నటించబోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా నెల్సన్ డైరెక్షన్ లో వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు…ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక వీడియోలో రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు.
ఇక అలాగే మా ఇద్దరిలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అంటూ వాళ్ళిద్దరు దర్శకుడిని అడిగిన క్వశ్చన్ కూడా ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్నారట. రజనీకాంత్ విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ విషయాన్ని ప్రేక్షకులు ఎలా జీర్ణించుకుంటారు అనేది తెలియదు కానీ వీళ్ళిద్దరి క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కమల్ హాసన్ హీరో అయినప్పటికి తనకు ఉండే ప్రాముఖ్యత తనకి ఉంటుంది.
రజనీకాంత్ కి ఉండే ఎలివేషన్ ఆయనకి ఉంటుంది. ఇద్దరికి సమానమైన స్క్రీన్ స్పేస్ ఉంటుందట. మరి వీళ్లిద్దరు కలిసి ఎలాంటి మ్యాజిక్ ని చేయబోతున్నారు నెల్సన్ వీళ్ళిద్దరి చేత ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘జైలర్ 2’ సినిమాను సైతం నెల్సన్ డైరెక్షన్ లోనే తెరకెక్కిస్తుండటం విశేషం…