Homeఎంటర్టైన్మెంట్Harish Shankar criticized by fans: డైరెక్టర్ హరీష్ శంకర్ ని ఉతికి ఆరేసిన పవన్...

Harish Shankar criticized by fans: డైరెక్టర్ హరీష్ శంకర్ ని ఉతికి ఆరేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఈ రేంజ్ లో అసలు ఊహించలేదు!

Harish Shankar criticized by fans: డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) పై పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ పీకల్లోతు కోపం మీద ఉన్నారు. బయట ఫ్యాన్స్ ఎలా ఉన్నారో తెలీదు కానీ, సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ మాత్రం హరీష్ శంకర్ కనపడితే కొట్టేలా ఉన్నారు. ఎందుకంటే నిన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం నుండి ‘#AuraOfUstaad’ పాట విడుదలైంది. ఈ పాట పై మొదటి నుండి చాలా హైప్ పెంచుతూ వచ్చింది మూవీ టీం. అలా హైప్ పెంచకుండా మాములుగా విడుదల చేసుంటే అభిమానుల నుండి ఇంత ఆవేశం వచ్చి ఉండేది కాదు. కానీ భారీ గా హైప్ పెంచారు, ఆ హైప్ కి దరిదాపుల్లో కూడా కంటెంట్ లేకపోవడం తో ఫ్యాన్స్ నుండి అలాంటి రియాక్షన్ వచ్చింది. ఓజీ లాంటి చిత్రం తర్వాత అభిమానులు కనీస స్థాయిలో క్వాలిటీ కంటెంట్ ని ఆశిస్తారు. పొరపాటున కూడా క్రింజ్ కంటెంట్ కావాలని కోరుకోరు కదా?.

నిన్న విడుదల చేసిన కంటెంట్ కూడా అలాగే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఆయన అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అందించిన సాహిత్యం మాత్రం ఫ్యాన్స్ ని తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. ‘మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే’ ఏంటి ?, ఏ కాలం లిరిక్స్ ఇవి?, కమర్షియల్ సినిమాలో హీరో కి ఎలివేషన్ ఇచ్చే సాంగ్ కి ఇంతకు మించి ఏమి ఉంటుంది అని కొంతమంది అనుకోవచ్చు, అలాంటి వాళ్ళు ఒక్కసారి గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ని విని రండి అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి నాసిరకమైన పాట పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తం మీద లేదు, సినిమా మీద మాకు ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా పొయ్యేలా చేస్తున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ లిరిక్స్ కోసం హరీష్ శంకర్ వారం రోజుల నుండి ఇంత బిల్డప్ ఇచ్చాడా?, ఆయన ఇస్తున్న ఈ అవుట్ డేటెడ్ కంటెంట్ ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తోనే ఆడియన్స్ లో హరీష్ శంకర్ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ నుండి తప్పులు తెలుసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తో సరి చేసుకుంటాడు అనుకుంటే, ఇలాంటి కంటెంట్ వదులుతున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి నాసిరకమైన కంటెంట్ ని వదులుతాడా?, లేదా అందరూ నచ్చే కంటెంట్ ని వదులుతాడా అనేది చూడాలి.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version