Rajinikanth , Pooja Hegde
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ'(Coolie Movie). ఈ సినిమా కోసం కేవలం రజినీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. కారణం ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు అవ్వడం వల్లే. దానికి తోడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు టాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ చిత్రాలకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు ఉన్నాయి కానీ, కోలీవుడ్ కి మాత్రం వెయ్యి కోట్ల సినిమా లేదు. ఇది ఆ సినీ పరిశ్రమ పెద్దలను తీవ్రంగా కలిచివేస్తుంది. అందుకే ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పెద్దగా కంటెంట్ ఏమి బయటకి రాలేదు. కానీ టైటిల్ గ్లిమ్స్ వీడియో కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
అదే విధంగా ఈ చిత్రం లో మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra), శివ కార్తికేయన్(Siva Karthikeyan), సందీప్ కిషన్(Sandeep Kishan) వంటి హీరోలు ఉండడంతో అంచనాలు ఇంకా కాస్త పెరిగాయి. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్(Sruthi hassan) నటిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో వచ్చే ఒక ఐటెం సాంగ్ లో పూజ హెగ్డే(Pooja Hegde) కనిపించబోతున్నట్టు నేడు మేకర్స్ అధికారిక పోస్టర్ ని విడుదల చేసారు. రెడ్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తున్న పూజా హెగ్డే లుక్స్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. పూజా హెగ్డే ఇప్పటి వరకు ‘రంగస్థలం’, ‘F3’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఆ రెండు ఐటెం సాంగ్స్ తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపాయి. ఇప్పుడు ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్ చేస్తుంది. రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.
అయితే ఈ ఐటెం చేస్తున్నందుకు పూజా హెగ్డే కి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నారట. సౌత్ లోనే ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈమధ్య కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమె ముట్టుకున్న ప్రతీ భస్మమే. అయినప్పటికీ ఈమెకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే అందుకు కారణం యూత్ లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న విడుదల చేసే ఆలోచనలో ఉందట మూవీ టీం. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : రజినీకాంత్ జైలర్ 2 కోసం సిద్ధమవుతున్న చిరంజీవి, బాలయ్య… ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారు..?