https://oktelugu.com/

Rajinikanth : రజినీకాంత్ జైలర్ 2 కోసం సిద్ధమవుతున్న చిరంజీవి, బాలయ్య… ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారు..?

ప్రస్తుతం తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. తమిళ్ సినిమా హీరోలు సైతం మన హీరోలతో క్యామియో రోల్స్ లో నటించమని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే పాన్ ఇండియాలో మన హీరోల సత్తా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు...

Written By: , Updated On : February 17, 2025 / 12:19 PM IST
Rajinikanth

Rajinikanth

Follow us on

Rajinikanth : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి ఘన విజయం సాధించడంతో ఆయనకి ఇక్కడ కూడా విపరీతమైన మార్కెట్ అయితే ఏర్పడింది. ఇక్కడున్న తెలుగు ప్రేక్షకులు మన స్టార్ హీరోలతో పాటు పోటీ పడుతూ మరి రజినీకాంత్ సినిమాలను చూస్తూ ఉంటారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేస్తూ వస్తున్న ఆయన ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో సోలో హీరోగా సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ప్రస్తుతం ఆయన నెల్సన్ (Nelsan) డైరెక్షన్ లో జైలర్ 2(Jailer 2) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన జైలర్ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి దాని ఫ్రాంచేజ్ గా వస్తున్న ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకొని ఎలాగైనా సరే ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో కూలీ (Kuli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత జైలర్ 2 కోసమే తన పూర్తి డేట్స్ ని కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన క్రేజ్ ను వాడుకుంటూ చాలామంది దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగారు…ఇక జైలర్ 2 సినిమాలో క్యామియో రోల్ పోషించడానికి బాలయ్య బాబు చిరంజీవి ఇద్దరిని అడిగి చూశారట.

మరి వాళ్ళిద్దరూ కూడా ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే క్యామియో రోల్ పోషిస్తే సరిపోతుంది. కానీ ఇద్దరిని అడగడం వాళ్ళిద్దరూ కూడా ఓకే అనడంతో వీళ్లలో ఎవరిని తీసుకోవాలి అని రజనీకాంత్ కొంత వరకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి ఇద్దరిలో ఎవరిని ఓకే చేస్తే బాగుంటుంది.

తద్వారా మరొకరు ఏమైనా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఫైనల్ గా ఈ సినిమాలో బాలయ్య బాబు నటించే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా ఏదైనా అనౌన్స్ మెంట్ రాబోతుందా లేదా అనేది…