Rajinikanth And Dhanush: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth)…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా రజనీకాంత్ గారే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినా కూడా రజనీకాంత్ మాత్రం ఒక సెన్సిబిలిటీతో మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా తన సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ వీలైనంత వరకు డూప్ ను పక్కన పెట్టి తనే ఓన్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన అణుక్షణం ఆరాటపడుతున్నాడు అంటే అతని అభిమానులు అంటే ఆయనకు ఎంత ఇష్టమో మన అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక సినిమా మీద ఆయన ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తాడు అనేది కూడా మనకు అర్థమవుతోంది. మరి ఇలాంటి రజనీకాంత్ తన అల్లుడు అయిన ధనుష్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కి అల్లుడు ధనుష్ కి గత కొద్దిరోజుల నుంచి గొడవలు అయితే జరగడం వల్ల వాళ్ళిద్దరూ డివోర్స్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth ) ధనుష్ (Dhanush) తో మాట్లాడటం లేదనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
Also Read: 6 గంటల్లో 25 మిలియన్ వ్యూస్..చరిత్ర తిరగరాసిన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్!
దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా కూడా ఆగిపోయింది అంటూ తమిళ్ మీడియాలో చాలావరకు వార్తలు అయితే వచ్చాయి. మరి వీటన్నింటికీ చెక్ చేపడుతూ వీళ్ళిద్దరు కలిసి చేయాల్సిన సినిమాని సక్సెస్ ఫుల్ గా చేస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ధనుష్ కూడా రీసెంట్ గా చేసిన కుబేర (Kubera) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తో ఆయన మరోసారి తన మార్కెట్ ను భారీగా పెంచుకొన్నాడు. ఇక చాలా రోజుల నుంచి తెలుగులో మార్కెట్ ను విస్తరించుకోవాలి అనుకుంటున్న ధనుష్ కోరిక కూడా నెరవేరిందనే చెప్పాలి.
ఇక ఇండస్ట్రీ లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలంటే అది ధనుష్ ఒక్కడికే సాధ్యమవుతుంది అనే రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకోవడం విశేషం…ఇక రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakataj) డైరెక్షన్ లో కూలీ(Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఇక దీంతో పాటుగా నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2 (Jailer 2) అనే సినిమా చేస్తున్నాడు…