3BHK Movie Twitter Review: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో సిద్దార్థ్(Siddharth). ఒకానొక దశలో ఆయనకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super star Mahesh Babu) సినిమాలకు మించిన ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కానీ రెండు మూడు ఫ్లాప్స్ రావడం తో ఆయన మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోవడం, తమిళం, హిందీ లలో అడపాదడపా సినిమాలు చేసుకోవడం, వాటిల్లో ఒకటి రెండు హిట్స్ పడడం ఇలా తన కెరీర్ సాగింది. అయితే ఇప్పుడు ఆయన మార్కెట్ అన్ని ఇండస్ట్రీస్ లోనూ బాగా పడిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే ఆయన పరిమితం అయ్యుంటే ఈరోజు ఆయన పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. ప్రస్తుతం సిద్దార్థ్ సినిమాలకు మన తెలుగు లో థియేటర్స్ దొరకడం కూడా కష్టమే. అంతటి దారుణమైన పరిస్థితికి పడిపోయాడు. కానీ ఆయన గత చిత్రం ‘చిన్నా’ పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.
Also Read: నితిన్ ‘తమ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ..ఈసారైనా నితిన్ తలరాత మారిందా?
ఇకపోతే రీసెంట్ గానే ఆయన 3BHK అనే సినిమాలో నటించాడు. నేడు ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇది కూడా చిన్నా చిత్రం లాగా డీసెంట్ గా ఆడుతుందేమో అని అనుకున్నారు. సిద్దార్థ్ తో పాటు ఈ చిత్రం లో శరత్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించాడు. మిడిల్ క్లాస్ నేపథ్యం లో తెరకెక్కించిన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఉందట. ఇలాంటి సినిమాల్లో ఆడియన్స్ ఎమోషన్స్ ని బలంగా ఆశిస్తారు. కనీసం రెండు మూడు సన్నివేశాలైన కనెక్ట్ అయితే టికెట్ కొన్నందుకు సంతృప్తి చెందుతాం అనే ఫీలింగ్ తో ఉంటారు. కానీ ఈ సినిమాలో అదే కొరవడింది అట. సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదట. పైగా ట్రైలర్ ని చూసినప్పుడు ఇది స్లో స్క్రీన్ ప్లే తో సాగే సినిమా అని స్పష్టంగా ఆడియన్స్ కి అర్థమైంది.
Also Read: హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ లో క్రిష్ లేని లోటు తెలిసిపోతుందా..? ఆయన ఉంటే ఆ తప్పు జరిగేది కాదా..?
స్లో స్క్రీన్ ప్లే అయినా ఎంగేజింగ్ గా ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ ఈ సినిమాకు అది కూడా మిస్ అయ్యిందట. కేవలం రెండు మూడు సన్నివేశాలు తప్ప సినిమా ఆశించిన స్థాయిలో లేదని , ఓవరాల్ గా చూసిన ప్రేక్షకుడికి పర్లేదు, ఎదో ఒకలాగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. ఈ సినిమాకు సిద్దార్థ్ మైనస్ అట. ఆయన నటన సహజత్వానికి చాలా దూరంగా ఉందని, వేరే హీరో అయ్యుంటే కొన్ని ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయ్యేవని అంటున్నారు. ఇక శరత్ కుమార్ నటన బాగానే ఉందట. ఓవరాల్ గా ఈ వీకెండ్ టైం పాస్ కోసం చూడాలి అనుకునే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ట్విట్టర్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రివ్యూస్ వచ్చాయో చూడండి.
✨ #3BHK Review #3BHKTelugu#3BHKReview
"3BHK" is an emotional, relatable journey of a middle-class family chasing their biggest dream: owning a 3BHK flat.
The story follows Vasudevan (Sarath Kumar), a disciplined and proud father, who believes a bigger home means more… pic.twitter.com/xz1xBxd1Xm
— CinemaPulse360 (@Cinemapulse360) July 4, 2025
@sri_sriganesh89 గారికి#3BHK సినిమాకు మంచి స్పందన రావడం చాలా సంతోషం. ఇల్లు అన్నది ప్రతి మనిషికి ఒక కల.ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం సినిమా ద్వారా చెప్పడం అభినందనీయం.
నేను ఈరోజే ఈ సినిమాను చూస్తాను#3BHKTelugu
— AS #BeSafe (@asrinivasss) July 4, 2025
You along with your entire family should watch #3BHK in theatres ❤️
HIGHLY RECOMMENDED
Book your tickets now!
️ https://t.co/pTKmnrpYzhGRAND RELEASE TOMORROW ❤#3BHKTelugu Grand release on July 4th by @MythriRelease. #Siddharth @realsarathkumar @sri_sriganesh89… pic.twitter.com/QBjqWedIrY
— Mythri Movie Distributors LLP (@MythriRelease) July 4, 2025
What is your first preference for this weekend?
#3BHKfromJULY4 #Thammudu #ShowTime #SoloBoy #3BHKTelugu #3bhk
— palnadu tweets (@palnadu_tweets) July 3, 2025