Photo Story: ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ అయ్యాడు. చెన్నై వెళ్లి నటనలో శిక్షణ తీసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నం చేశాడు. కొందరు లెజెండరీ దర్శకుల దృష్టిలో పడ్డాడు. మొదట్లో సపోర్టింగ్, విలన్ రోల్స్ కూడా చేశాడు. ఒక్కో సినిమాకు ఎదుగుతూ హీరో అయ్యాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి, స్టైల్, నటనలో వైవిధ్యం చూపుతూ స్టార్ అయ్యాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఎవరో కాదు రజినీకాంత్.
1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని మరాఠి ఫ్యామిలీలో రజినీకాంత్ పుట్టాడు. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. తండ్రి వృత్తిరీత్యా కానిస్టేబుల్. నలుగురు అన్నదమ్ముల్లో రజినీకాంత్ చిన్నవాడు. 9 ఏళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోయాడు. స్కూల్ లో చదివే రోజుల్లో నాటకాలు ఆడేవాడు. ఓ ఆధ్యాత్మిక గురుకుల పాఠశాలలో రజినీకాంత్ చదువుకుంటూ నాటకాలు వేసేవాడు. ఓ నాటకంలో రజినీకాంత్ ప్రతిభను చూసి కన్నడ రచయిత డి ఆర్ బెంద్రే మెచ్చుకున్నారు.
చదువు పూర్తి అయ్యాక బస్ కండక్టర్ వృత్తిలో చేరాడు. రజినీకాంత్ స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా పై దృష్టి సారించాడు. అప్పట్లో సౌత్ ఇండియన్ సినిమాకు చెన్నై కేంద్రంగా ఉండేది. అన్ని భాషల చిత్రాలు అక్కడే తెరకెక్కేవి. చెన్నై వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాడు. లెజెండరీ దర్శకుడు కే బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన అపూర్వ రాగంగల్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో అన్ని రకాల పాత్రలు చేశాడు.
కమల్ హాసన్, శ్రీదేవి కంటే కూడా రజినీకాంత్ రెమ్యునరేషన్ తక్కువ ఉండేదట. నల్లగా ఉండే రజినీకాంత్ నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి క్రియేట్ చేసుకున్నాడు. హీరోగా ఎదగడానికి రూపం అడ్డు కాదని నిరూపించాడు. ముఖ్యంగా స్టైల్ ఐకాన్ గా మారాడు. రజినీకాంత్ అతిపెద్ద కమర్షియల్ హీరోగా అవతరించాడు. ముత్తు , బాషా, అరుణాచలం, నరసింహ, చంద్రముఖి, రోబో, రోబో 2.0 వంటి చిత్రాలతో రజినీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లారు.
ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న హీరోల్లో రజినీకాంత్ ఒకరు. ఆయన గత చిత్రం జైలర్ రూ. 600 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. రజినీకాంత్ కి జపాన్ తో పాటు పలు దేశాల్లో అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ నటించిన ముత్తు జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన ఇండియన్ మూవీగా ఉండేది. ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదలయ్యే వరకు ఆ రికార్డు చెక్కు చెదరలేదు. రజినీకాంత్ ఎవర్ గ్రీన్ హీరో. సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారు.