Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులందరిని ఏ మాత్రం అలరించకపోగా సినిమా మీద నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా సంబంధించిన స్టోరీ మీద కూడా ఇప్పుడు కొన్ని కామెంట్లైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ స్టోరీ ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లైతే కొంతమంది సముద్ర తీరంలో కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాయి. ఇక దానిని అడ్డగించడానికి ప్రయత్నం చేసిన శ్రీకాంత్ ను సైఫ్ ఆలీఖాన్ బ్యాచ్ చంపెయ్యబోతుంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల కి అడ్డు నిలిచి అక్కడ ఇల్లిగిల్ బిజినెస్ ఆపేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ వల్ల శ్రీకాంత్ కి కూడా అనుకోని నష్టం అయితే జరుగుతుంది. దాంతో శ్రీకాంత్ సైఫ్ అలీఖాన్ తో కలిసి దేవర ను చంపేస్తారు. ఇక దేవర కొడుకు అయిన చిన్న ఎన్టీఆర్ ముందుగా పిరికితనం ను ప్రదర్శించి ఆ తర్వాత ధైర్యవంతుడై వాళ్ళ నాన్నను చంపిన వాళ్లను చంపడానికి తిరుగుతూ ఉంటాడు.
ఫైనల్ గా వాళ్ళను చంపేస్తాడు. ఈ స్టోరీ ప్రస్తుతం దేవర సినిమా కథగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలాంటి కథతోనే గోపిచంద్ భీమా అనే సినిమా చేశాడు. దాంతో గోపీచంద్ సినిమాని ఎన్టీఆర్ కాపీ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలోకి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వస్తుంది.
మరి ఈ సినిమా స్టోరీ ఇదేనా కాదా అనేది ఫైనల్ గా ఎవరికి తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు ట్రైలర్ ను బట్టి స్టోరీని అంచనా వేస్తే మాత్రం భీమా సినిమా దేవర సినిమా రెండు సినిమాలా స్టోరీ ఒకేలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 27 తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యం లో అసలు మ్యటర్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం దేవర సినిమా రిలీజ్ అయ్యేంతే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది మరింత డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఆయితే ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.