https://oktelugu.com/

Rajinikanth And Chiranjeevi: రజినీకాంత్ హీరో గా..చిరంజీవి నిర్మాతగా వ్యవహరించిన ఏకైక సినిమా అదేనా..?ఎవరికీ తెలియని షాకింగ్ నిజం!

అల్లు అరవింద్ చిరంజీవి బావ కాబట్టి, సినిమాకి ఆయన పేరు జత చేయడం వల్ల మరింత హైప్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో సమర్పకుడిగా నీపేరు పెడతాను బావ అనగానే, మెగాస్టార్ వెంటనే ఒప్పుకున్నాడట.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 01:00 AM IST

    Rajinikanth And Chiranjeevi

    Follow us on

    Rajinikanth And Chiranjeevi: 70 ఏళ్ళ వయస్సులో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న హీరోలు ఇండియా మొత్తం మీద ఎవరైనా ఉన్నారా అంటే అది తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి, తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే. వీళ్ళ వయస్సులో ఉన్న హీరోలు పూర్తిగా మార్కెట్ ని కోల్పోయి,ఫేడ్ అవుట్ అయ్యి, రిటైర్ అయ్యే స్థితిలో ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పటికీ సూపర్ స్టార్స్ గానే కొనసాగుతున్నారు. ఇంకో పదేళ్ల దాటినా ఈ ఇద్దరి హీరోల స్టార్ స్టేటస్ చెక్కు చూడరాదు అనిపిస్తుంది. వయస్సు వీళ్లిద్దరికీ కేవలం ఒక నెంబర్ మాత్రమే అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే సరిసమానమైన సూపర్ స్టార్ స్టేటస్ ఉండడం వల్ల వీళ్లిద్దరు ఈమధ్య కాలం లో కలిసి ఒకే సినిమాలో నటించలేదు కానీ , అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ రెండు సినిమాలు తెరకెక్కాయి.

    ఆరోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఆ తర్వాత ఇద్దరికీ స్టార్ స్టేటస్ రావడంతో మళ్ళీ కలిసి నటించలేకపోయారు. కానీ 1989 వ సంవత్సరంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద తమిళం లో రజినీకాంత్ తో ‘మాపిళ్ళై’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అత్తకు యముడు..అమ్మాయికి మొగుడు’ కి రీమేక్ గా తెరకెక్కింది. తెలుగు లో ఈ సినిమా ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో, తమిళంలో కూడా అంతే పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యింది. సుమారుగా 200 రోజులు తమిళనాడు థియేటర్స్ లో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అయితే ఈ సినిమాకి సమర్పకుడిగా చిరంజీవి వ్యవహరించాడు. అంతే కాకుండా ఈ చిత్రం క్లైమాక్స్ లో ఆయన స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడు.

    అల్లు అరవింద్ చిరంజీవి బావ కాబట్టి, సినిమాకి ఆయన పేరు జత చేయడం వల్ల మరింత హైప్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో సమర్పకుడిగా నీపేరు పెడతాను బావ అనగానే, మెగాస్టార్ వెంటనే ఒప్పుకున్నాడట. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించింది అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కి మాత్రమే. తెలుగు లో డబ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.