https://oktelugu.com/

Devaki Nandana Vasudeva : ఫ్లాప్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన మహేష్ మేనల్లుడు..’దేవకీ నందన వాసుదేవ’ కి 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

కానీ అశోక్ గల్లా మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి, ఈ సినిమా కాకపోయినా భవిష్యత్తులో ఆయన మంచి సినిమా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 09:44 PM IST

    Devaki Nandana Vasudeva

    Follow us on

    Devaki Nandana Vasudeva : ఒకప్పుడు స్టార్ హీరోల కుటుంబాల నుండి ఎవరైనా ఇండస్ట్రీ లోకి వస్తే భారీ హైప్ ఉండేది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చేవి. మెగా ఫ్యామిలీ లో చిరంజీవి తర్వాత వచ్చిన ప్రతీ ఒక్కరు తమ మొదటి సినిమాతోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్నారు. అదే విధంగా నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ కి చెందిన వారసులకు కూడా వాళ్ళ మొదటి సినిమాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మహేష్ బాబు ఒక్కడే సూపర్ స్టార్ అయ్యాడు. మిగిలిన వాళ్లంతా కెరీర్ లో సక్సెస్ లను చూడలేకపోయారు. కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు మొదటి సినిమాకి అప్పట్లో అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆయన తన మార్కెట్ ని నిలబెట్టుకోలేకపోయాడు. అదే విధంగా కృష్ణ కుటుంబం నుండి ఆయన కూతురు మంజుల , అల్లుడు సుధీర్ బాబు వంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీ లోకి వచ్చారు.

    కానీ సక్సెస్ కాలేకపోయారు, ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు,కృష్ణ మనవడు అశోక్ గల్లా ఇండస్ట్రీ లోకి ‘హీరో’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ అనే చిత్రం విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. మొదటి ఆట నుండే సోషల్ మీడియా లో మంచి టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం నిల్. ఎంత దారుణం అంటే, ఈ సినిమాకి హైదరాబాద్ మొత్తం కలిపి వెయ్యి టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదట. అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. థియేటర్స్ నడవడానికి అవసరమయ్యే రెంట్స్ ని కూడా రాబట్టలేకపోవడంతో ఈ చిత్రానికి నెగటివ్ షేర్స్ వచ్చాయి.

    కనీసం వీకెండ్ లో అయినా వసూళ్లు పుంజుకుంటాయేమో అని ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినోళ్లు ఆశపడ్డారు. కానీ ఎలాంటి మార్పు లేదు. దీంతో రెండు రోజులకు కలిపి ఈ సినిమాకి సున్నా షేర్ వచ్చింది. ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ ని అందించాడు. ఆయన క్రేజ్ ఈ చిత్రానికి బజ్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు కానీ, అది జరగలేదు. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు తో థియేట్రికల్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేయించారు, అయినప్పటికీ కూడా ఈ సినిమాకి క్రేజ్ రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ రావాలన్నా కూడా కచ్చితంగా ప్రొమోషన్స్ బలంగా చేయాలి. కానీ ఈ మూవీ టీం ప్రొమోషన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఈ సినిమా విడుదలైంది అనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. కానీ అశోక్ గల్లా మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి, ఈ సినిమా కాకపోయినా భవిష్యత్తులో ఆయన మంచి సినిమా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.