Vishwak Sen: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలని కొందరు అనుకుంటారు. ఈ క్రమంలో ఎవరైనా పరిచయస్తులు ఉంటే వారి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, రవితేజ లాంటి వారు సొంత ప్రతిభతో చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి బాటలో మరికొందరు హీరోలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సొంత ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకరు. హీరోగా, డైరెక్టర్ గా తన ప్రతిభ చూపుతున్న విశ్వక్ సేన్ ఇటీవల ‘మెకానిక్ రాఖీ’ సినిమాతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈయన గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న ఆయన తన చదువు గురించి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ కు చెందిన దినేష్ నాయుడు అలియాస్ విశ్వక్ సేన్ 1995 మార్చి 29న జన్మించారు. చాలా మంది లాగే విశ్వక్ సేన్ బాల నటుడిగా 2009లో వచ్చిన‘బంగారు బాబు’అనే సినిమాలో కనిపించాడు. ఆ తరువాత 2017లో ‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా సమయంలో విశ్వక్ సేన్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది? ’ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ‘పాగల్’ సినిమాతో విశ్వక్ సేన్ కు ఇండస్ట్రీ వైడ్ గా పేరొచ్చింది. ఈ సినిమా తరువాత ‘ఓరి దేవుడా’ మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కూడా కనిపిస్తాడు. అయితే గత ఏడాది ‘గామి’అనే ప్రత్యేకమైన సినిమాతో విశ్వక్ సేన్ నటన ప్రతిభా బయటపడింది.దీంతో ఆయనకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీని తరువాత ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
ఇటీవల విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాఖీ’ సినిమాతో నవంబర్ 22న థియేటర్లోకి వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో CSE చదివిని కుర్రాడు మెకానిక్ గా మారుతాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ ను సినిమాల్లో CSE కుర్రాడిగా కనిపించిన మీరు రియల్ లైఫ్ లో ఏం చదువుకున్నారు? అన్న ప్రశ్నకు విశ్వక్ సేన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తాను ‘హ్యాపీడేస్’ సినిమా చూసిన తరువాత చాలా మంది బీటెక్ చేసి మోసపోయారు. కానీ నేను బీఏ కమ్యూనికేషన్, బీఏ జర్నలిజం చేశా. కానీ ఇప్పటికీ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ పాస్ కాలేదు. ఎవరైనా అడిగితే బీఏ డిస్ కంటిన్యూ అని చెబుతా.. అని చెప్పాడు.
సోలోగా వస్తున్న సొంతంగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ ప్రతిభను చూసి సీనియర్ హీరోలు సైతం ప్రశంసిస్తుంటారు. ఈ ఉత్సాహంతోనే ఆయన డైరెక్టర్ గా కూడా మారిపోయారు. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాను తీసిన ఆయనపై ప్రశంసలు కురిపించారు. అయితే యాక్షన్ తో పాటు లవ్ ఎమోషనల్ టచ్ చేసే విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.