Rajendra Prasad Comments On Brahmanandam: వయస్సు పెరిగేకొద్దీ నలుగురికి మంచి చెప్పేలా ఉండాలి కానీ, చిన్నపిల్లలు కూడా చీదరించుకునే వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ముఖ్యంగా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక మాట మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలి. ఈమధ్య కాలం లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సభా మర్యాదలు పాటించకుండా, తన తోటి నటీనటులపై నోరు జారిన విధానాన్ని చూసి, నిన్న గాక మొన్న పుట్టినోళ్లు కూడా సోషల్ మీడియా లో సభా మర్యాద తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సినీ కెరీర్ అనుభవం అంత వయస్సు కూడా ఉందని వాళ్ళ చేత ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పించుకునే స్థాయికి దిగజారిన రాజేంద్ర ప్రసాద్ ని చూస్తుంటే కోపం రావడం లేదు, జాలి వేస్తోంది. తెలుగు బాషని, తెలుగు సినిమాని ప్రేమిస్తూ, మన తెలుగు సినిమాలో నటించడానికి కూడా వచ్చిన ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ‘రాబిన్ హుడ్’ మూవీ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ ఎలా అవమానించాడా మనమంతా చూసాము.
సోషల్ మీడియా లో విపరీతమైన నెగిటివిటీ రావడం తో, ఆడియన్స్ కి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత SV కృష్ణ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్, అక్కడే ఉన్నటువంటి కమెడియన్ అలీ ని దుర్భాషలు ఆడడం, పక్క రోజు వెంటనే మళ్లీ క్షమాపణలు చెప్పడం, ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యను అనడం మనమంతా చూసాము. కానీ కేవలం మాటలు చెప్పడమే, ఆయనలో ఎలాంటి మార్పు లేదు. నిన్న ‘సహాకుటుంబానం’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్, అక్కడే ఉన్నటువంటి బ్రహ్మానందం పై మరోసారి నోరు జారాడు. ఆయన మాట్లాడుతూ ‘పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత..నేను ఏమి మాట్లాడగలను’ అని అంటాడు.
అప్పుడు బ్రహ్మానందం ‘మేము ఎంత ఎదిగినా నీ శిష్యులమే కదా’ అని అంటాడు, దానికి రాజేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ ‘ఎంతైనా ముసలి ముండాకొడుకువి కదా’ అని అంటాడు. ఎవరు నేనా అని బ్రహ్మానందం అడిగితే, కాదు నేను అని కవరింగ్ చేసుకున్నాడు. సభా సరస్వతి కి ప్రణామం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాజేంద్ర ప్రసాద్, ఆ సరస్వతి మర్యాద భంగం కలిగించేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్?, ఒకసారి అంటే పొరపాటు, మరి రెండవ సారి, మూడవ సారి కూడా అదే రిపీట్ చేస్తూ పోతే ఆయన తప్పు చేస్తున్నట్టే కదా లెక్క?, ఎందుకు ఇలా అయిపోయాడు?. ఇండస్ట్రీ లో రాజేంద్ర ప్రసాద్ లెజెండరీ కింగ్, మనమంతా చిన్నతనం నుండి చిరంజీవి సినిమాలతో పాటు, ఆయన సినిమాలు కూడా చూస్తూ పెరిగాము. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ని అందించిన చరిత్ర ఆయనది. అలాంటి లెజండరీ స్థానం లో ఒక వ్యక్తి ఇలా తన గౌరవాన్ని రోజురోజుకి దిగజార్చుకుంటూ వెళ్లడం నిజంగా బాధేస్తోంది.
