Bigg Boss 9 Telugu Pawan Kalyan: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షోకి ఇక మీదట సెలబ్రిటీలు రావాలంటే భయపడేలా చేస్తున్నారు బిగ్ బాస్ టీం. సీజన్ 7 మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ టీం సామాన్యుడిగా ఆడియన్స్ కి పరిచయం చేసింది. హౌస్ లోకి వచ్చిన తర్వాత అతను రైతు బిడ్డ సెంటిమెంట్ ని ఉపయోగించుకొని టైటిల్ గెలిచాడు. బయటకి వచ్చిన తర్వాత అతని అసలు రంగు అందరూ చూసి ఇలాంటోడిని గెలిపించి పంపించామా అని అందరూ తలబాదుకున్నారు. ఇతని అసలు రంగు ని బయట పెట్టేందుకు ప్రయత్నం చేసిన అమర్ డీప్ పై అప్పట్లో జనాలు దాడి చేయడం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈసారి అలాంటి ఉద్రిక్త పరిస్థితులకు ఛాన్స్ లేదు కానీ, ఉద్దేశపూర్వకంగా బిగ్ బాస్ టీం పవన్ కళ్యాణ్ ని టైటిల్ విన్నర్ ని చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది.
10 వ వారం వరకు తనూజ తిరుగులేని మెజారిటీ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వచ్చింది. ఆమెని అందుకోవడం ఈ సీజన్ లో ఎవరి తరం కాదని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పడం మొదలు పెట్టాడో, అప్పటి నుండి బిగ్ బాస్ టీం అతన్ని విన్నర్ ని చేయాలనీ ఫిక్స్ అయిపోయింది. ఉద్దేశపూర్వకంగా తనూజ కి వరుసగా నెగిటివ్ ప్రోమోలు, నెగిటివ్ ఎపిసోడ్స్ పడేలా చేశారు, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి నాన్ స్టాప్ గా పాజిటివ్ ఎపిసోడ్స్ పడేలా చేశారు. ఫలితంగా ఇప్పుడు అతని గ్రాఫ్ తారాస్థాయికి చేరి తనూజ ని దాటిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగానే అతన్ని టైటిల్ రేస్ కి తీసుకొస్తుంది అనడానికి నిన్నటి ఎపిసోడ్ ఒక ఉదాహరణ.
సంజన, రీతూ చౌదరి వివాదం లో సంజన ని తప్పు బట్టి, గేట్లు తెరిచి వెళ్లిపొమ్మని చెప్పిన నాగార్జున, అదే నామినేషన్ ప్రక్రియ లో రీతూ చౌదరి పై అసభ్య పదజాలం తో నోరు పారేసుకున్న పవన్ కళ్యాణ్ పై ఎందుకు అదే రేంజ్ కోటింగ్ ఇవ్వలేకపోయాడు?, నువ్వు మాట్లాడిన మాటలకు ‘బీప్’ సౌండ్ వాడాల్సి వచ్చింది, కోపం చాలా డేంజర్, ఒకే ఒక్క సంఘటన చాలు మిమ్మల్ని పాతాళం లోకి నెట్టడానికి అంటూ చాలా కూల్ గా వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు నాగార్జున. ఇది న్యాయమా?, సోషల్ మీడియా ఈ అంశం పై నెటిజెన్స్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అంతే కాదు, రైతు బిడ్డ ట్యాగ్ ని వాడుకొని పల్లవి ప్రశాంత్ ఎలా అయితే టైటిల్ విన్నర్ అయ్యాడో, ఆర్మీ పేరు వాడుకొని పవన్ కళ్యాణ్ కూడా అదే తీరులో టైటిల్ గెలుచుకోవడానికి చూస్తున్నాడు. ఆయన పీఆర్ టీం ఇలాగే సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. బూతు మాటలతో మాట్లాడిన వాడికి భారీ కోటింగ్ ఇవ్వకపోగా, నాగార్జున సెల్యూట్ చేసి మరీ అభినందించడం విడ్డూరం. ఇంతటి పక్షపాత బిగ్ బాస్ సీజన్ భవిష్యత్తులో కూడా చూడలేము ఏమో. సెలబ్రిటీలను టీఆర్ఫీ కోసం వాడుకొని, వాళ్ళు గెలిపించాలి అనుకున్న వారిని గెలిపిస్తున్నారు. ఈ మాత్రం దానికి దీన్ని రియాలిటీ షో అనడం దేనికి?, మీరే చెప్పండి!.