Peddi Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ఫ్యాన్స్ లో మాత్రమే కాదు, ఆడియన్స్ లో కూడా అంచనాలు రోజురోజుకూ భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. అందుకు కారణం ఈ సినిమా నుండి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్. గ్లింప్స్ వీడియో తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. నేషనల్ వైడ్ గా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. IPL సీజన్ లో అంతర్జాతీయ క్రికెటర్లు సైతం ఈ గ్లింప్స్ వీడియో ని అనుకరిస్తూ బోలెడన్ని వీడియోలు చేశారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘చికిరి చికిరి’ పాట అయితే ఒక సునామీ ని క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాట గురించే చర్చ. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో రీల్స్, యూట్యూబ్ లో మిలియన్ల సంఖ్యలో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు నెటిజెన్స్.
అతి తక్కువ సమయం లో ఈమధ్య కాలం లో ఒక పాట ఇంతలా వైరల్ అవ్వడం ఏ సినిమాకు కూడా జరగలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమాలోని ఒక కీలక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్ లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో పాటు, వందలాది మంది ఫైటర్స్ కూడా ఉన్నారట. ఈ పోరాట సన్నివేశానికి ‘చావా’ హీరో విక్కీ కౌశల్ తండ్రి, శ్యామ్ కౌశల్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఈయన ఫైట్ మాస్టర్ గా పని చేసాడు. ముఖ్యంగా దంగల్ చిత్రం లోని కుస్తీ ఫైట్ సన్నివేశాలన్నీ ఈయన కంపోజ్ చేసినవే.
ఈ సన్నివేశాలను చూసేటప్పుడు మనమంతా థియేటర్స్ లో గూస్ బంప్స్ ఫీలింగ్స్ ని పొందాము. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం కోసం ‘దంగల్’ ని మించి ఎమోషనల్ ఫైట్ సన్నివేశాలను ఆయన కంపోజ్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఈ పోరాట సన్నివేశం ఉంటుందని, భారత దేశంలోని సినీ ప్రియులందరూ ఈ సన్నివేశాన్ని చూసి మెంటలెక్కిపోతారని, దంగల్ కంటే వంద రెట్లు ఎక్కువ గూస్ బంప్స్ ఫీలింగ్ ని పొందుతారని అంటున్నారు. ఇలా రోమాలు నిక్కపొడుచుకునే సన్నివేశాలు పెద్ది చిత్రం లో చాలానే ఉంటాయట. ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుందని, రామ్ చరణ్ నటనకు ఈసారి నేషనల్ అవార్డు కచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఇవి ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది మార్చ్ 27 వరకు ఆగాల్సిందే.