Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకొని వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) హీరోగా ‘హను రాఘవపూడి’ (Hanu Ragahavapudi) దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ (Fouji) సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో సరైన క్లారిటి లేనప్పటికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఇంతకుముందు చేసిన సీతారామం (Seetharamam) సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతూ ఉండడం అలాగే ప్రభాస్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు తను చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ చేసుకుంది.
మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. హను రాఘవపూడి తీసిన అందాల రాక్షసి సినిమా నుంచి సీతారామం (Seetharamam) వరకు ప్రతి సినిమాలో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా లవ్ స్టోరీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ వల్ల కెరియర్ పోగొట్టుకున్న స్టార్ హీరో…
అందమైన క్యూట్ లవ్ స్టోరీ తో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాతో దర్శకుడు భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ఇంతకుముందు రాధే శ్యామ్ (Radheshyam) సినిమాతో ఒక లవ్ స్టోరీ సినిమా చేశాడు. అందులో లవర్ బాయ్ గా ప్రభాస్ ను చూడలేకపోయారు.
మరి ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది. ప్రభాస్ అద్భుతంగా నటించి లవ్ స్టోరీని స్క్రీన్ మీద పండించగలడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు ఇప్పటికి ప్రభాస్ కి పోటీని ఇచ్చే హీరోలు మాత్రం ఇండస్ట్రీ లో ఎవరు లేరని చెప్పాలి.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?