Rajasaab
Rajasaab Movie : ఒకప్పుడు రెండేళ్లకు ఒక చిత్రం చేస్తూ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ప్రభాస్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. రాధే శ్యామ్ అనంతరం ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్, కల్కి తక్కువ వ్యవధిలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ మరో రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు మారుతీ మొదటిసారి ఓ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో మారుతీకి ఆఫర్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యమే. అప్పట్లో ఫ్యాన్స్ మారుతీతో మూవీ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ కి ప్లాప్స్ పడుతున్న నేపథ్యంలో వారు ఆందోళన చెందారు.
Also Read : రాజా సాబ్’ లో ఆ రెండు ట్విస్టులు ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేయబోతుందా? థియేటర్ కి ఒంటరిగా వెళ్తే సాహసమే!
అయితే ప్రభాస్ ని రివీల్ చేస్తూ రాజాసాబ్ ప్రోమో విడుదల చేయగా.. భారీ రెస్పాన్స్ దక్కింది. రాజాసాబ్ టీజర్ లో ప్రభాస్ లుక్ ఒకప్పటి ఆయన లవర్ బాయ్ లుక్ ని గుర్తు చేసింది. సదరు టీజర్ రాజాసాబ్ మూవీపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోయేలా చేసింది. సినిమాపై అంచనాలు పెరిగాయి. రాజాసాబ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాలి. అయితే వాయిదా పడనుందని ఇండస్ట్రీ టాక్. ఎలాంటి ప్రమోషన్స్ షురూ చేయలేదు. కాబట్టి వాయిదా పుకార్లకు ఈ పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయి.
కాగా స్టార్ కమెడియన్ సప్తగిరి రాజాసాబ్ మూవీలో కీలక రోల్ చేశాడట. ప్రభాస్ తో ఆయనకు కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయట. రాజాసాబ్ చిత్రాన్ని 100 రోజులు షూట్ చేశారని సప్తగిరి అన్నాడు. రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో మైలురాయి లాంటి చిత్రం అవుతుంది. 10 ఏళ్ల వరకు రాజాసాబ్ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది అన్నాడు. సప్తగిరి కామెంట్స్ ఒక్కసారిగా హైప్ పెంచేశాయి. సప్తగిరి నటించిన పెళ్లికాని ప్రసాద్ విడుదల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సప్తగిరి రాజాసాబ్ అప్డేట్ ఇచ్చాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ , రిద్ది కుమార్ హీరోయిన్స్. రాజాసాబ్ హారర్ కామెడీ డ్రామా అనే ప్రచారం జరుగుతుంది. ఓ థియేటర్ లో మొత్తం కథ నడుస్తుందట. ఇక ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం ఫౌజీ. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. నెక్స్ట్ స్పిరిట్ పట్టాలెక్కనుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ కి రావడం కష్టమేనా..?
Web Title: Rajasaab movie star comedian saptagiri boosted the hype for rajasaabs movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com