Rajasaab : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో ఆయన చేసిన రాజాసాబ్ (Rajasaab) సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా విషయంలో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫౌజీ(Fouji)సినిమా షూటింగ్లో పాల్గొంటున్న ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట… తన డేట్స్ ని కూడా ఆ సినిమా కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఫౌజీ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ప్రభాస్ బాగా నమ్ముతున్నాడు.మరి రాజాసాబ్ సినిమా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని చాలా రోజుల తర్వాత అలాంటి సినిమా చేస్తున్నానని తన సన్నిహితులు దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రాజాసాబ్ మూవీలో అంత మేటర్ ఉందా? 10 ఏళ్ళు దాక మర్చిపోరట, హైప్ పెంచేసిన స్టార్ కమెడియన్
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉందట. ఆ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది అంటూ దర్శకుడు తెలియజేయడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది ఉన్నప్పటికి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధికంగా పాన్ ఇండియా సినిమాలను చేసి అత్యధిక వసూళ్లను రాబట్టిన హీరో కూడా ప్రభాస్ అనే చెప్పాలి. ఇక ఆయన చాలా తొందరగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ చాలావరకు సక్సెస్ లను సాధిస్తూ తన కంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… ఇకమీదట కూడా తను అదే విధంగా ముందుకు సాగి భారీ విజయాలను సాధించాలని తన అభిమానులైతే కోరుకుంటున్నారు. ఇక మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో మాత్రం ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదట.
స్క్రిప్ట్ లో చాలా వరకు ట్విస్ట్ లు ఉన్నప్పటికి ఒక్క ట్విస్ట్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుందని సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ ట్విస్ట్ ఏంటి అనేది ఎవరికి రివిల్ చేయడం లేదు. కానీ ఆ ట్విస్ట్ సెకండాఫ్ లో వస్తుందనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు…
Also Read : రాజా సాబ్’ లో ఆ రెండు ట్విస్టులు ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ చేయబోతుందా? థియేటర్ కి ఒంటరిగా వెళ్తే సాహసమే!