Rajamouli’s RRR : “ఆర్ఆర్ఆర్” (RRR Movie) అక్టోబర్ 13న రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యమే. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ?ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నారు అభిమానులు. అయితే, రాజమౌళి (Rajamouli) 2022 సంక్రాంతికి టార్గెట్ గా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడు. కానీ 12, 13వ తేదీలలో ఆల్ రెడీ మహేష్, పవన్ సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి కాబట్టి, రాజమౌళి జనవరి 7వ తేదీన “ఆర్ఆర్ఆర్” ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.
ఎంత పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం, ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పటికీ రాజమౌళి కొత్త డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మిగిలిన సినిమా వాళ్లకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనేది పెద్ద సమస్య అయిపోయింది. రాజమౌళి జాగ్రత్తగా సినిమాని ప్లాన్ చేయకపోతే.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావు.
కానీ ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ కలిసి హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ సినిమా ‘నార్త్ థియేట్రికల్’ హక్కులను సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా కూడా భారీ ఆసక్తి నెలకొంది.
పైగా ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటం, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.