ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో రిలీజ్ అయి, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. పైగా ఈ ఓటీటీ సంస్థ తెలుగులో అడుగుపెట్టి రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా వల్ల ఈ ఓటీటీ సంస్థకు కూడా బాగా ప్లస్ అయింది. మంచి పాపులారిటీతో పాటు డిజిటల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
మెయిన్ గా “వివాహ భోజనంబు”లో మొదటి అరగంట సినిమా మంచి ఫన్ తో నడిస్తోంది. కామెడీ ఉంటే చాలు, మాకు ఇక ఏమి వద్దు అన్నట్టు ప్రేక్షకులు కూడా ఆ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికి జస్ట్ ఓకే మూవీ లాంటి ఈ చిత్రాన్ని.. బాగా ఆదరించారు. దాంతో నిర్మాతగా సందీప్ కిషన్ కి ఈ సినిమాతో బాగా గిట్టుబాటు అయింది.
హీరోగా హిట్లు కొట్టలేకపోయినా.. నిర్మాతగా మాత్రం మొదటి అడుగులోనే మంచి హిట్ అందుకున్నాడు. సుమారు కోటి 20 లక్షలతో ఈ చిత్రాన్ని సందీప్ నిర్మించాడు. కానీ సోనీ లివ్ సంస్థ మాత్రం సినిమా చూసి.. కోటి 70 లక్షలు ఇచ్చి ఈ చిత్రాన్ని కొనుక్కొంది. ఇక ఎలాగూ శాటిలైట్ రైట్స్ ఉన్నాయి.
శాటిలైట్ రైట్స్ కి కోటి 30 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రీమేక్ రైట్స్ రూపంలో కూడా మరో నలభై లక్షలు వస్తాయి. అంటే.. ఈ చిన్న సినిమాతో సందీప్ దాదాపు 2 కోట్ల 20 లక్షలు లాభాలు పొందాడు. మొత్తానికి సందీప్ కిషన్ కి ఇది డబుల్ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అయింది. ఇక హీరోగా నటించిన కమెడియన్ సత్య కూడా తన కామెడీతో నవ్వులు పూయించాడు.