HanuMan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలు వస్తు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ ఫ్రెష్ స్టోరీస్ తో వస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మూస ధోరణిలో కథలు వచ్చేవి కానీ ఇప్పుడు హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా మనవాళ్లు సినిమాలను చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఇండియాలో లోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్ చేయడానికి ప్రశాంత్ వర్మ రాజమౌళి తో గ్రాఫిక్స్ వర్క్ చేయడానికి మీకు తెలిసిన ఏదైనా కంపెనీ ఉంటే సజెస్ట్ చేయండి అని అడిగాడట. దాంతో రాజమౌళి నాకు తెలిసిన వాళ్ళు అందరూ వేరే వేరే కంపెనీలోకి వెళ్లిపోయి ఒక్కొక్కరు ఒక్క ప్లేస్ లో ఉన్నారు అని చెప్పి గ్రాఫిక్స్ ఎవరితో చేయించిన పర్లేదు.
కానీ గ్రాఫిక్స్ అనేది తెలియకుండా ఉండాలి అంటే గ్రాఫిక్స్ షాట్స్ ని తీసేటప్పుడు ఎక్కువగా దుమ్ము ఉండేట్టు చూసుకో, అలాగే డార్క్ ప్లేస్ లో గ్రాఫిక్స్ వర్క్ ఉండేలా చూసుకో అలా చేసినప్పుడు గ్రాఫిక్స్ చేస్తే అది కొంచెం అటు ఇటు అయిన కూడా దాని లుప్ హోల్స్ అనేవి ఏవి ప్రేక్షకుడికి కనిపించకుండా ఉంటాయి అని చెప్పారట. దాంతో ప్రశాంత్ వర్మ కూడా సరే అన్నట్టుగా రాజమౌళి చెప్పినట్టుగానే తను డార్క్ ప్లేస్ లో గ్రాఫిక్స్ ని వాడే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. అలాగే ఎక్కువగా దుమ్ము , ధూళి పెట్టి వాటిని మేనేజ్ చేశాడు.
ఇక మొత్తానికైతే హనుమాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా వందల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పటివరకు ఈ సంవత్సరం లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి…