https://oktelugu.com/

Sukumar And Bachhibabu : సుకుమార్ కు షాక్ ఇచ్చిన శిష్యుడు బుచ్చిబాబు

టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కైనా మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేయాలని ఉంటుంది. అందులోనూ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తో చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. కానీ డేట్స్ కుదరదు. కొంత మంది ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాలేదు కూడా.

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2024 / 11:48 AM IST

    Sukumar Andh Buchhibabu

    Follow us on

    Sukumar And Bachhibabu:టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుకుమార్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ యన సినిమాలు మిగతా వారికంటే డిఫరెంట్ గా ఉంటాయి. సుకుమార్ సినిమాలు సర్వసాధారణంగా అందరికీ అర్థం కావు. కానీ ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ వరకు వెళ్తాయి. ఆయన లాస్ట్ మూవీ ‘పుష్ప’ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ తాను మాత్రమే కాకుండా తనలా సినమాల తీసే కొందరు శిష్యులను తయారు చేశారు. వారు ఇప్పటికే కొన్ని సినిమాలు తీసి సక్సస్ అయ్యారు. వారిలో బుచ్చిబాబు ఒకరు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు.. ఇటీవల ఆ గురువుకు పెద్ద షాక్ ఇచ్చాడు. అదేంటంటే?

    సుకుమార్ శిశ్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మరో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. లేటేస్టుగా మరో మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీ ప్రారంభోత్సవం మార్చి 20న ప్రారంభోత్సవం జరుపుకుంది. కొన్ని నెలల తరువాత ఈ సినిమా షూటింగ్ స్పీడప్ చేసుకోనుంది. ఇందులో మెగా హీరో రామ్ చరణ్, బాలీవుడ్ బామ జాహ్నవి నటిస్తోంది. దీంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    అయితే అంతకంటే ఎక్కువగా బుచ్చిబాబు గురువు సుకుమార్ కు పెద్దగా షాక్ ఇచ్చాడట. టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కైనా మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేయాలని ఉంటుంది. అందులోనూ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తో చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. కానీ డేట్స్ కుదరదు. కొంత మంది ఎంతో ప్రయత్నించినా సాధ్యం కాలేదు కూడా. ఇలా ప్రయత్నించి విఫలమైన వారిలో సుకుమార్ కూడా ఉన్నాడట. ఎప్పటి నుంచో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. కానీ కదరలేదు.

    అయితే తన శిశ్యుడు బుచ్చిబాబు ఏకంగా మెగా హీరోతో సినిమా కమిట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని సుకుమార్ స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెలక్టె్ చేసుకోవడం మరింత షాక్ ఇచ్చినట్లయిందని అన్నారు. ఇలా తనకు బుచ్చిబాబు షాక్ ల మీద షాక్ లు ఇచ్చాడని సుకుమార్ చెప్పడం ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత బుచ్చిబాబు సినిమాలో పాల్గొననున్నాడు. ఇక ఈ మూవికి ‘పెద్ది’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.