https://oktelugu.com/

Nithya Shetty :అందాల డోర్లు ఓపెన్ చేసిన నిత్యాశెట్టి.. ఇంతలా ఎందుకు రెచ్చిపోయిందబ్బా?

కోడి రామకృష్ణ ‘దేవుళ్లు’ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు నిత్యాశెట్టి గురించి ఎవరూ మరిచిపోరు. పెరిగి పెద్దయిన ఈ భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.

Written By: , Updated On : March 21, 2024 / 11:56 AM IST
Nithya shetty

Nithya shetty

Follow us on

Nithya Shetty : చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత హీరోయిన్లు అయిన వాళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అయితే కొందరు స్టార్లుగా మారగా.. మరికొందరు మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కొందరు సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అందచందాలతో అలరిస్తున్నారు. అలాంటి వారిలో నిత్యాశెట్టి ఒకరు. ఈమె పేరు చెప్పగానే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ నిత్యాశెట్టి చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సినిమాల గురించి చెబితే మాత్రం గుర్తుపడుతారు. కోడి రామకృష్ణ ‘దేవుళ్లు’ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు నిత్యాశెట్టి గురించి ఎవరూ మరిచిపోరు. పెరిగి పెద్దయిన ఈ భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.

2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘దేవుళ్లు’సంచలనంగా మారింది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లలో నిత్యాశెట్టి ఒకరు. తమ అమ్మానాళ్ల కోసం ఇద్దరు చిన్నారులు దేవుళ్లను కొలుస్తూ ఆలయాలు సందర్శిస్తుంటారు. చైల్డ్ ఆర్టిసుగా నిత్యాశెట్టి ఆ కాలంలోనే ఎంతో చక్కగా నటించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన నిత్యాశెట్టి ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టారు.

పెరిగి పెద్దయ్యాక ‘పిట్టకథ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నువ్వు తోప్ రా, తదితర సినిమాల్లో నటించారు. అయితే నిత్యాశెట్టికి సరైన గుర్తింపు రాలేదు. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. దీంతో నిత్యాశెట్టి సినిమాల నుంచి తప్పుకున్నారా? అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ తాను సినిమాల్లో నటించడానికి రెడీ అన్నట్లు సోషల్ మీడియా వేదికగా నిత్యాశెట్టి లేటేస్ట్ ఫొటోలను అప్డేట్ చేశారు.

అయితే ఇందులో నిత్యాశెట్టి అందంతో రెచ్చపోయారు. హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారు గుండెళ్లో మంటపుట్టిస్తోంది. ఎంతో సాంప్రదాయంగా కనిపించిన నిత్యాశెట్టి ఒక్కసారిగా ఇలా కనిపించేసరికి సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అయితే కొందరు సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా చేస్తుందని అంటున్నా.. అందాల ఆరబోతతో అలరిస్తోందని అంటున్నారు. మొత్తంగా ఈ పిక్స్ ను చూసి నిత్యాశెట్టి అందాల డోర్లను ఓపెన్ చేసిందా? అని అంటున్నారు.