https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా 2 పార్టులుగా రాబోతుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్నప్పటికి రాజమౌళిని మించిన దర్శకులు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొకరు లేరని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 08:11 AM IST

    Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఈయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా ఆయనకు ఇండియా లెవల్లో భారీ గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ఈ చిత్రం గురించి మనం ఎంత మాట్లాడకుండా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా అడ్వెంచర్స్ చేస్తూ కనిపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సరే భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రాజమౌళి ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం ఆయన ప్రపంచంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకుంటాడు.

    మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి చేయబోతున్న ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

    ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుంటున్న మహేష్ అభిమానులకు సైతం ఈ న్యూస్ అనేది ఒక తీపి కబుర్ గా అనిపిస్తుంది. ఇక రాజమౌళి తో రెండు పార్టీలు చేయడం అంటే ఆషామాషీ విషయమైతే కాదు. ఇక బాహుబలి సినిమా కోసమే ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడు.

    ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమా పాన్ వరల్డ్ కాబట్టి దీనికోసం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల సమయమైతే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు అన్ని సంవత్సరాలు తీసుకొని మంచి సినిమా చేస్తున్నాడు అంటే మాత్రం అది మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…మరి ఈ సినిమా అనుకున్నట్టుగానే రెండు పార్టీలుగా వస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే రాజమౌళి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరమైతే ఉంది…