https://oktelugu.com/

Rahul Gandhi: మోడీ, అదానీ ని ఇంటర్వ్యూ చేసిన రాహుల్ గాంధీ.. వైరల్ వీడియో

కొంతకాలంగా రాహుల్ గాంధీ అదానీ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ అండదండలు అందించడం వల్లే గౌతమ్ అదాని తన ఆస్తులను అంతకంతకు పెంచుకుంటున్నారని విమర్శిస్తున్నారు

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 10, 2024 / 08:13 AM IST

    Rahul Gandhi

    Follow us on

    Rahul Gandhi: కొద్దిరోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానిపై విపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ అదానీ అక్రమాలకు నరేంద్ర మోడీ అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం గౌతమ్ అదానీ వ్యవహారాలపై కన్నెర్ర చేయగానే రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. విలేకరుల సమావేశం నిర్వహించి మరీ మండిపడ్డారు.

    అదాని కంపెనీలపై.. ఆయన సాగిస్తున్న వ్యాపారాలపై విచారణ కొనసాగించాలని కొంతకాలంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించాలని ఆందోళన చేస్తున్నారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఇదేవిధంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే సోమవారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ వినూత్న నిరసనకు తీరదేశారు. అదానిపై విచారణకు పట్టు పట్టారు. ఇద్దరి విపక్ష ఎంపీలకు నరేంద్ర మోడీ, గౌతమ్ అదాని మాస్కులు ధరింపజేసి వినూత్నంగా ఇంటర్వ్యూ చేశారు..” మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? దానికి ఎటువంటి ప్రత్యేకత ఉంది? మీరిద్దరు ఎందుకు ఇంత కలిసికట్టుగా ఉంటారు?” అని రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. “మేము కలిసి పనిచేస్తాం.. మా మధ్య సంవత్సరాలుగా బంధం కొనసాగుతోంది” అని వారిద్దరు వ్యాఖ్యానించారు. “నాకు ఏది కావాలన్నా మోడీని అడిగి తీసుకుంటానని” అదానీ మాస్క్ ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీతో పేర్కొన్నారు.. పార్లమెంట్ ముందు ఈ సంఘటన జరగగా.. దీనిని కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఒక సెక్షన్ మీడియా దీనికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చింది.

    కొంతకాలంగా విమర్శలు

    కొంతకాలంగా రాహుల్ గాంధీ అదానీ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ అండదండలు అందించడం వల్లే గౌతమ్ అదాని తన ఆస్తులను అంతకంతకు పెంచుకుంటున్నారని విమర్శిస్తున్నారు..” వారిద్దరిదీ ప్రత్యేకమైన బంధం. నరేంద్ర మోడీ గౌతమ్ ఆదానికోసం ఏదైనా చేస్తారు. ఏమైనా చేస్తారు. అందు గురించే ఆయన అంతకంతకు ఎదిగిపోతున్నారు. గౌతమ్ అదాని వ్యాపార ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను నరేంద్ర మోడీ తాకట్టు పెడుతున్నారు. శ్రీలంకలో అదే జరిగింది. ఇటీవల కెన్యా దేశం ఒప్పందాలు రద్దు చేసుకుంది. చివరికి అమెరికా కూడా కేసులు నమోదు చేసింది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీకి అర్థం కావడం లేదు. వారిద్దరూ భారత పరువును మంట కలుపుతున్నారు. వారి స్వార్థం కోసం దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారని” రాహుల్ గాంధీ ఇటీవల పలు వేదికలలో విమర్శించారు. ఇప్పుడు పార్లమెంటును తన నిరసనకు వేదికగా చేసుకున్నారు. అయితే దీనిపై బిజెపి కూడా అదే స్థాయిలో మండిపడుతుంది. దేశంలో కుంభకోణాలకు చిరునామాయన కాంగ్రెస్ పార్టీ.. నరేంద్ర మోడీని విమర్శించడం దారుణమని పేర్కొంటున్నారు.. అంచలంచెలుగా ఎదిగిన భారతీయ వ్యాపారి విషయంలో కాంగ్రెస్ పార్టీ ధోరణి ప్రమాదకరమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అక్రమాలు జరిగాయి ఒకసారి ఆలోచించుకోవాలని బిజెపి నాయకులు హితవు పలుకుతున్నారు.