KCR Fight On The Center: రెండు వైపులా కేంద్రంపై కేసీఆర్ పోరు.. టీ బీజేపీ నేత‌లు ట్రాప్ లో ప‌డుతున్నారా..?

KCR Fight On The Center: ఏమో అనుకున్నాం గానీ.. కేసీఆర్ మాత్రం కేంద్రం మీద గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ముందుకు వెళ్తున్నాడు. ఇప్ప‌టికే వ‌డ్లు కొన‌ట్లేదంటూ ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో నిర‌స‌న‌లు అంటూ హోరెత్తిస్తున్న గులాబీ బాస్‌.. యాక్ష‌న్ ప్లాన్ మ‌రింత వేగం చేశాడు. వ‌డ్లు కొనాలంటూ మంత్రుల‌ను ఢిల్లీకి పంపించి కేంద్ర మంత్రుల‌పై ఒత్తిడి తెస్తున్న కేసీఆర్‌.. ఒక‌వేళ కొనక‌పోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయాలంటూ ఇప్ప‌టికే పిలుపునిచ్చాడు. అయితే ఇదే స‌మ‌యంలో […]

Written By: Mallesh, Updated On : March 24, 2022 4:52 pm
Follow us on

KCR Fight On The Center: ఏమో అనుకున్నాం గానీ.. కేసీఆర్ మాత్రం కేంద్రం మీద గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ముందుకు వెళ్తున్నాడు. ఇప్ప‌టికే వ‌డ్లు కొన‌ట్లేదంటూ ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో నిర‌స‌న‌లు అంటూ హోరెత్తిస్తున్న గులాబీ బాస్‌.. యాక్ష‌న్ ప్లాన్ మ‌రింత వేగం చేశాడు. వ‌డ్లు కొనాలంటూ మంత్రుల‌ను ఢిల్లీకి పంపించి కేంద్ర మంత్రుల‌పై ఒత్తిడి తెస్తున్న కేసీఆర్‌.. ఒక‌వేళ కొనక‌పోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయాలంటూ ఇప్ప‌టికే పిలుపునిచ్చాడు.

KCR

అయితే ఇదే స‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డంపై కూడా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయడం సంచ‌ల‌నం రేపుతోంది. అంటే ఒకే స‌మ‌యంలో రెండు విష‌యాల‌పై పోరు చేయ‌ల‌ని భావిస్తున్నార‌న్న‌మాట‌. అటు వ‌డ్ల‌తో పాటు ఇటు పెరిగిన ఇంధ‌నం ధ‌ర‌ల మీద కేంద్రం పై ఒత్తిడి తేవాల‌ని కేసీఆర్ చూస్తున్నారు.

Also Read: RRR Movie Box Office Collection: ‘ఆర్ఆర్ఆర్’ వర్సెస్ ‘రాధేశ్యామ్’ వర్సెస్ ‘పుష్ప’ వర్సెస్ ‘భీమ్లానాయక్’

ఈ ప్లాన్ లో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెరిగిన ధ‌ర‌ల మీద ధ‌ర్నాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మండ‌ల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ధ‌ర్నాలు చేస్తున్నారు. ఇక హైద‌రాబాద్ లోని చీఫ్ రేషనింగ్ ఆఫీస‌ర్ కార్యాలయం ముందు మంత్రి తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత ధ‌ర్నాలో పాల్గొన్నారు.

BJP Leaders

ఇక అటు మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు అయిన పీయూష్ గోయల్ ను కలుస్తున్నారు. అయితే కేసీఆర్ చేప‌ట్టిన ఈ ప‌నుల‌తో ఇటు రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌ను త‌న ట్రాప్ లో ప‌డే విధంగా చేయాల‌నుకుంటున్నారు. రాజ‌కీయాల్లో ట్రెండ్ సెట్ చేసే వారిదే పై చేయి అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే స్థాయిలోనే బీజేపీ నేత‌ల‌ను ఉంచుతున్నారు.

దాంతో తాను తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున అడిగే వ్య‌క్తిగా బాధ్య‌త తీసుకుంటే.. బీజేపీ నేత‌లు మాత్రం స‌మాధానాలు చెప్పే వ్య‌క్తులుగా మారిపోతున్నారు. కేసీఆర్‌ను ప్ర‌శ్నిస్తే బీజేపీ నేత‌లు పై చేయిలో ఉంటారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా.. తానే ట్రెండ్ సెట్ట‌ర్ అవుతున్నారు. మ‌రి కేసీఆర్ ట్రాప్లో రాష్ట్ర బీజేపీ నేత‌లు పడిపోతారా.. లేక తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తారా అన్న‌ది మాత్రం చూడాలి.

Also Read: RRR AP & Telangana First Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్

Recommended Video:

Tags