Rajamouli On Jawan: జవాన్ సినిమాని ప్రశంసించిన రాజమౌళి.. అసలు విషయం చదవకుండా జవాబు ఇచ్చిన షారుఖ్ ఖాన్!

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా తొలిరోజు అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రెటీస్ తమ పాసిటివ్ రివ్యూ షేర్ చేస్తున్నారు.

Written By: Swathi, Updated On : September 9, 2023 2:07 pm

Rajamouli On Jawan

Follow us on

Rajamouli On Jawan: షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా తరువాత మరో సూపర్ హిట్ అందుకునేశాడు. సౌత్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. నయనతార, దీపికా పడుకొని హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలనైగా చేసి అల్లరించారు.

సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా తొలిరోజు అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రెటీస్ తమ పాసిటివ్ రివ్యూ షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి తెగ మెచ్చుకున్నారు మన దర్శకధీరుడు రాజమౌళి.

అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో పాటు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కూడా విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం విడుదలైన ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఇక నిన్న రాజమౌళి ఈ రెండు సినిమాలను ఒకదాని తరవాత ఒకటి చూశారట. ఇక ఇదే విషయాన్ని స్వయాన ఈ డైరెక్టర్ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు. ముందుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

‘స్వీటీ ఎప్పటిలాగే అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోయింది. నవీన్ పొలిశెట్టి బోలెడంత నవ్వుని, వినోదాన్ని అందించాడు. ఇంత మంచి విజయాన్ని అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టీమ్‌కి అభినందనలు. ఒక సున్నితమైన అంశాన్ని వినోదభరితంగా తెరకెక్కించిన దర్శకుడు మహేష్ బాబుకి కుదోస్’ అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఆ తరవాత ‘జవాన్’ సినిమాను ప్రశంసిస్తూ ‘షారుఖ్ ఖాన్‌ని బాక్సాఫీసు బాద్‌షా అని అనడానికి కారణం ఇదే. భూమి బద్దలైపోయే ఓపెనింగ్ వచ్చింది. తన విజయదుందుభిని ఉత్తరాదిలో కూడా కొనసాగించిన అట్లీకి అభినందనలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న జవాన్ చిత్ర బృందానికి అభినందనలు’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్‌కు షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

‘థాంక్యూ సో మచ్ సార్. సినిమాకు మీరు ఇస్తున్న క్రియేటివ్ ఇన్‌పుట్స్ నుంచి మేమంతా చాలా నేర్చుకుంటున్నాం. మీకు వీలైనప్పుడు దయచేసి మా సినిమా చూడండి. ఆ తరవాత మీరు నాకు కాల్ చేసి నేను మాస్ హీరోగా చేయగలిగానో లేదో చెప్పండి. హహ.. ప్రేమతో మీకు ధన్యవాదాలు సార్’ అని షారుఖ్ ఖాన్ స్పందించారు.

కాకపోతే, ఇక్కడ ఆయన.. రాజమౌళి చేసిన ముందు ట్వీట్ చూడకుండా రిప్లై ఇచ్చారు అన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకు అంటే రాజమౌళి క్లియర్ గా తాను సినిమా చూసాను అని చెప్పినా షారుక్ తన జవాబులో దయచేసి ఒకసారి సినిమా చూడండి అనడంతో.. ప్రేక్షకులందరూ ముందు రాజమౌళి చేసిన ట్వీట్ సరిగా చూడమని షారుఖ్ ఖాన్ ట్వీట్ కింద కామెంట్లు పెడుతున్నారు.