Brahmaji
Brahmaji: సీనియర్ సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి అంతే తెలియని సినీ ప్రేక్షకులు దాదాపు ఎవరు ఉండరు. సినీ వార పత్రిక ‘సంతోషం’ ఎడిటర్ సురేష్ కొండేటి. తన సంతోషం పత్రిక ద్వారా అవార్డులు ఇవ్వటం దగ్గర నుంచి మొదలైన ఆయన పాపులాడికి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఎక్కువైపోయింది. సురేష్ గురించి తెలియక చాలా మంది ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఇలా ట్రోల్ చేయడానికి కారణం సినిమా ప్రెస్ మీట్లలో ఆయన అడిగే ప్రశ్నలే. హీరో హీరోయిన్లను ఇబ్బంది కలిగించే ప్రశ్నలు ఎన్నో అడుగుతుంటారు ఈ జర్నలిస్టు. ఆయన ప్రశ్నలు వైరల్ అవ్వడమే కాకుండా ఆయన పైన విమర్శలు కూడా తీసుకొస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఈ రోజు ఆయన చేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఈరోజు సురేష్ కొండేటి ఎక్స్ (ట్విట్టర్)లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఈ పోస్టులు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. బ్లూ కలర్ టీషర్ట్, ట్రాక్ ప్యాంట్, షూస్ ధరించి హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారు. ఇక సురేష్ కొండేటి తన ట్వీట్‌కు ‘Today is My Gym workout Pics’ అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఇదేం ఇంగ్లిష్ అంటూ కొందరు ఎగతాళి చేస్తున్నారు.
కాగా ఈ ఫొటోలు చూసిన ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ.. సురేష్ కొండేటికి సెటైర్ వేశారు. ‘మీరు మేకప్ వేసుకుని జిమ్‌కి వెళ్తారా’ అని బ్రహ్మాజీ కామెంట్ చేశారు. ఇక దీనికి సురేష్ కొండేటి తనదైన స్టైల్ స్పందించారు. ‘ఇది నా ఒరిజినల్ ఫేస్.. మేకప్ వేసుకోలేదు’ అని సమాధానం ఇచ్చారు.
దీనికి మళ్లీ బ్రహ్మాజీ తన జిఫ్ ఇమేజ్‌తో రిప్లై ఇచ్చారు. ఈ జిఫ్ ఇమేజ్‌లో బ్రహ్మాజీ చాలా సీరియస్‌గా థింక్ చేస్తున్నట్టు ఉంది. దీంతో చాలామంది ప్రేక్షకులు బ్రహ్మాజీని సపోర్ట్ చేస్తూ సురేష్ పైన ట్రోల్ వేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే, ఇంకొందరు సురేష్ చాలా బాగున్నారని.. హీరో కంటెంట్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఏకంగా హీరోగా మీరు ఎందుకు ట్రై చెయ్యట్లేదు అని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ‘స్లమ్ డాగ్ హస్బెంబ్’ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సురేష్ కొండేటి.. బ్రహ్మాజీ మధ్య జరిగిన ఒక సంఘటన అప్పట్లో వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రశ్న అడగడానికి సురేష్ మైక్ అందుకోగానే బ్రహ్మాజీ ఫన్నీగా స్పందించారు. ‘మా సురేష్ అడుగుతున్నాడంటే.. ఏమి అడగబోతున్నాడో చెప్పదలుచుకున్నా. హీరోని అడుగుతాడు.. ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్లయింది కదా, శోభనం కుక్కతో జరిగింది కదా, ఎలా జరిగింది?’ అని బ్రహ్మాజీ అన్నారు. దీనికి జవాబు కూడా చెప్పాలని బ్రహ్మాజీని సురేష్ కొండేటి అడిగారు. ‘చాలా బాగా జరిగింది. మీరు కూడా ట్రై చేయండి’ అని తాను సమాధానం ఇస్తానని బ్రహ్మాజీ అందరినీ నవ్వించారు. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ అయింది.