https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

Pushpa: టాలీవుడ్లో డైరెక్టర్ రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన రాజమౌళి ‘బాహుబలి’ సిరీసులతో ప్రపంచ స్థాయి డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో మన ముందుకు రాబోతున్నాడు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రానుంది. ఈ మూవీ కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2021 / 03:12 PM IST
    Follow us on

    Pushpa: టాలీవుడ్లో డైరెక్టర్ రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన రాజమౌళి ‘బాహుబలి’ సిరీసులతో ప్రపంచ స్థాయి డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. సినిమా సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్న రాజమౌళి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో మన ముందుకు రాబోతున్నాడు.

    Pushpa

    జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రానుంది. ఈ మూవీ కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఉన్నాయి.

    ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఓవైపు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బన్నీపై రాజమౌళి ప్రసంశలు కురిపించాడు. దీంతో వీరి కలయికలో సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

    రాజమౌళి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందిస్తూ.. ఆయన మాటలు తన మనస్సుకు హత్తుకున్నాయన్నారు. అందరు హీరోల్లోలాగే తనకు కూడా రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలని ఉందన్నారు. ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఏదోఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావాన్ని బన్నీ వ్యక్తం చేశాడు.

    Also Read: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!

    బన్నీ తాజాగా నటించిన ‘పుష్ప’ మూవీ డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజు కానుంది. ఈ మూవీలో బన్నీ తొలిసారి డీగ్లామరస్ రోల్ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా.. అవటివాడిగా కన్పించబోతున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా బ్యూటిఫుల్ సమంత ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘ఊ అంటావా మావా’ అంటూ సాగిపోయే పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

    మరోవైపు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ తో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరుతోంది. దీంతో మరో మూడేళ్ల వరకు రాజమౌళి డేట్స్ ఖాళీగా లేవని అర్థమవుతోంది. ఈనేపథ్యంలో ‘పుష్ప(బన్నీ)’తో రాజమౌళి సినిమా ఇప్పట్లో లేదని చెప్పొచ్చు. అయితే ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబినేషన్ ఎదురు చూస్తున్నారు.

    Also Read: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్​స్టాలో రష్మిక వీడియో పోస్ట్​.. లక్షల్లో లైక్​లు