https://oktelugu.com/

ఛ.. వీడేం హీరో ? వద్దులే అండి కృష్ణగారు !

Rajasekhar: అవి ‘వందేమాతరం’ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తోన్న రోజులు. ఒక కొత్త హీరో కావాలి. అప్పటికే చాలామందిని చూశారు. కానీ, ఎందుకో ఎవరు ‘హీరో పాత్ర’కు సరిపోలేదు. ఆ సమయంలో ఓ కుర్రాడి ఫోటో వచ్చింది. ‘అబ్బాయి బాగున్నాడు, ఇతనే మన హీరో’ అనుకున్నారు. పిలిపించారు. ఆ కుర్రాడి వైపు చూస్తూ ‘పేరు ఏమిటయ్యా ?’ అని అడిగారు దర్శకుడు టి.కృష్ణగారు. ఆ అబ్బాయి పిచ్చి చూపులు చూస్తున్నాడు. టి.కృష్ణగారు ఈ సారి ఇంగ్లీష్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : December 15, 2021 4:34 pm
    Follow us on

    Rajasekhar: అవి ‘వందేమాతరం’ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తోన్న రోజులు. ఒక కొత్త హీరో కావాలి. అప్పటికే చాలామందిని చూశారు. కానీ, ఎందుకో ఎవరు ‘హీరో పాత్ర’కు సరిపోలేదు. ఆ సమయంలో ఓ కుర్రాడి ఫోటో వచ్చింది. ‘అబ్బాయి బాగున్నాడు, ఇతనే మన హీరో’ అనుకున్నారు. పిలిపించారు. ఆ కుర్రాడి వైపు చూస్తూ ‘పేరు ఏమిటయ్యా ?’ అని అడిగారు దర్శకుడు టి.కృష్ణగారు.

    Rajasekhar

    Rajasekhar

    ఆ అబ్బాయి పిచ్చి చూపులు చూస్తున్నాడు. టి.కృష్ణగారు ఈ సారి ఇంగ్లీష్ లో అడిగారు. ఆ అబ్బాయి చెప్పలేక చెబుతూ మొత్తానికి పేరు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ చివరకు ఎలాగోలా ‘రాజశేఖర్’ అని అన్నాడు. ‘వీడెవ్వడురా బాబు, సరిగ్గా మాట్లాడమే రావడం లేదు, ఛ.. వీడేం హీరో ? ఇక డైలాగ్ లు ఏమి చెబుతాడు ? పైగా తెలుగు కూడా రాదు. వద్దులే అండి కృష్ణగారు’ అని ఆ సినిమా సహా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ అబ్బాయి పనికిరాడు అని తేల్చిపడేశారు.

    వాళ్ళు తన గురించి ఏమి అనుకుంటున్నారో ఎదురుగా కూర్చున్న ఆ అబ్బాయికి (హీరో రాజశేఖర్) అర్ధం అయింది. వాళ్ళు వెళ్ళిపో అని చెప్పకముందే లేచి బయటకు వెళ్తున్నాడు. అది గమనించారు టి.కృష్ణగారు. ‘మన భాష తెలియకపోయినా, మన భావాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు, ఇతనే మన హీరో’ అన్నాడు. ఇక ఏడిద నాగేశ్వరరావుకి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు.

    అలా రాజశేఖర్ తెలుగు ఇండస్ట్రీలోకి రావడం రావడమే విజయశాంతి సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. తెలుగు రాకపోయినా, తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు రాజశేఖర్‌. నిజానికి టి.కృష్ణగారి దయ వల్లే రాజశేఖర్ హీరోగా నిలబడ్డాడు. సినిమాల్లో సీరియస్ పోలీస్‌ అంటే రాజశేఖర్, రాజశేఖర్ అంటేనే సీరియస్ నెస్ అనే స్థాయికి రాజశేఖర్ ఎదిగాడు.

    Also Read: Pushpa: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

    అప్పట్లో చాలామంది రాజశేఖర్ ను చూసి నవ్వేవాళ్ళు. ఇతనికి తెలుగే సరిగా మాట్లాడటం రావట్లేదు, ఇక బాడీ లాంగ్వేజ్‌ అయితే చెండాలం. అసలు ఎమోషన్ కి రియాక్షన్ కి సంబంధం లేదు’ అంటూ అవహేళన చేశారట. కానీ, వరుసగా రాజశేఖర్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. చూస్తుండగానే స్టార్ అయ్యాడు. హేళన చేసినవారే డేట్లు ఇవ్వండి అంటూ వెంటబడ్డారు. ఏడిద నాగేశ్వరరావు కూడా రాజశేఖర్ డేట్లు కోసం సంవత్సరం పాటు ఎదురుచూశారు.

    Also Read: RGV Shocking Comments: ఇంపాజిబుల్ సిచ్యువేషన్స్‌లో పోర్న్ చూస్తా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

    Tags