Rajamouli To Meet Y S Jagan: ప్రముఖ సినీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం గా విజయవాడకు వచ్చి సీఎం .జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ నెల 25న RRR సినిమా రిలీజ్ విషయం పై కలిసినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు నిర్మాత దానయ్య కూడా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో ఇప్పటికే సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ సమావేశమైన సంగతి తెలిసిందే.
అగ్ర కథానాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు గురించి సుధీర్ఘంగా మాట్లాడారు. సీఎం జగన్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం ఇచ్చి.. దానికి తగట్టు జీవో కూడా రిలీజ్ చేశాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు జరిపిన చర్చ మంచి ఫలితాలను ఇచ్చాయి.
కాగా టాలీవుడ్ పరిశ్రమ సమస్యలను పరిష్కరించినందుకు రాజమౌళి ఇరు రాష్ట్రాల సీఎంలకు థాంక్స్ చెబుతూ… ట్వీట్ చేశారు కూడా. పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. కొత్త జీవో ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెప్పారు రాజమౌళి.
ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు. మరి ఇప్పుడు మళ్ళీ జగన్ ను ఎందుకు కలుస్తున్నాడో అని ఆలోచనలో పడ్డారు సినీ జనం. మరి చూడాలి. ఎందుకు కలుస్తున్నాడో.