https://oktelugu.com/

Chiranjeevi – Salman Khan: అక్కడ చిరంజీవిని కలిసి ముచ్చట్లు పెట్టిన సల్మాన్ ఖాన్ !

Chiranjeevi – Salman Khan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా సల్మాన్ ఖాన్ ఈ రోజు ముంబైలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చిరు కోసం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా సల్మాన్‌ ఖాన్ ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 03:56 PM IST
    Follow us on

    Chiranjeevi – Salman Khan: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా సల్మాన్ ఖాన్ ఈ రోజు ముంబైలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చిరు కోసం ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా సల్మాన్‌ ఖాన్ ఈ సినిమా కోసం తన డెట్స్‌ సర్దుబాటు చేసి ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీకి తన షెడ్యూల్‌ కెటాయించాడట.

    Chiranjeevi – Salman Khan

    అయితే, సల్మాన్ ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆరా ఇస్తున్నారు. అయితే, ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌నే తెలుగు వెర్షన్ లో స‌ల్మాన్ ఖాన్ చేయబోతున్నాడు. నిజానికి సల్మాన్ ఖాన్ ది ఈ సినిమాలో చిన్న అతిథి పాత్ర మాత్రమే. కానీ సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఒక్క క్షణం దర్శనమిచ్చినా ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరు. ఏది ఏమైనా మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో సల్మాన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే.

    God Father Movie

    అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ కి హీరోయిన్ గా లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ లో మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ కూడా పాల్గొన్నాడు. ఇక చిరు బర్త్ డే కి వచ్చిన ఈ సినిమా మోషన్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

    Also Read: జగన్ ను రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు ?
    ముఖ్యంగా చిరంజీవి తలకు క్యాప్‌ తో అలాగే చేతిలో గన్‌ పెట్టుకుని అలా స్టైలిష్‌ గా పోస్టర్ లో కనిపించే సరికి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. అందుకే, ఈ సినిమా అప్ డేట్ కోసం అందరూ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అన్నట్టు గంగవ్వ యూట్యూబ్‌ లో బిగ్ స్టార్. ఫ్రేమ్ లో ఆమె కనబడగానే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు పాపులారిటీ అనేది ప్రముఖులకు మాత్రమే సొంతం అన్నట్టు ఉండేది.

    కానీ డిజిటల్ విప్లవం పుణ్యమా అని గంగవ్వ లాంటి పాత కాలపు పల్లెటూరి అవ్వ కూడా నేటి ట్రెండింగ్ పర్సన్ గా చలామణి అవుతున్నారు. దీనికి తోడు బిగ్‌ బాస్‌ లోకి వెళ్లి గంగవ్వ బాగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే, గంగవ్వ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలోనే కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పైగా చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందని వార్తలు వచ్చాయి.ఇది నిజమే అని తెలుస్తోంది.

    Also Read: తగ్గేదే లే అంటున్న ‘భీమ్లా నాయక్’.. తగ్గిపోయిన ‘రాధేశ్యామ్’ !

    Tags