https://oktelugu.com/

Unstoppable: చిరు, బాలయ్య, మోహన్​బాబులపై గాసిప్స్​ బాగా మాట్లాడుకుంటాం- రాజమౌళి

Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 06:17 PM IST

    Unstoppable Balayya

    Follow us on

    Unstoppable: నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక వైపు సినిమాలు మరో వైపు ఓటీటీ లో సందడి చేస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వెండితెరపై తన నటనతోనే కాకుండా… ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలను తనదైన స్టైల్లో ప్రశ్నలను సందిస్తూ.. గేమ్స్‏తో బాలకృష్ణ చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోకు మంచు మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు.

    తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి, కీరవాణిలతో కలిసి 5వ ఎపిసోడ్​ వచ్చింది. శుక్రవారం ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్​ స్ట్రీమింగ్​ అయ్యింది. కాగా, ఇందులో బాలయ్య, రాజమౌళి, కీరవాణీల మధ్య మంచి రసవత్తర సంభాషణ జరిగింది. రాజమౌళి, కీరవాణీలకు బాలయ్య చిక్కు ప్రశ్నలు వేసి పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేసేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటారని బాలయ్య అడగ్గా.. రాజమౌళి సినిమాల గురించి, హీరోల గాసిప్స్​ గురించి అని చెప్పారు. ఏ హీరో గురించి అని అడగ్గా.. జక్కన్న చెప్పనని అన్నారు.

    Unstoppable

    Also Read: శ్యామ్ ​సింగరాయ్ ​సెన్సార్​ టాక్​ ఎలా ఉందంటే?

    అయినా బాలయ్య జక్కన్నను వదలకుండా అడిగేసరికి.. చరణ్​, తారక్​, నా గురించి కూడా మాట్లాడుకుంటారా?.. అని అడిగారు బాలయ్య.  అందురు జక్కన్న తెలివిగా ఒకరనేమ్​ లేదు చిరు, మోహన్​బాబు, మీ గురించి కూడా గాసిప్స్ మాట్లాడుకుంటామని నవ్వేశారు. అయితే, ఆ గాసిప్స్ ఏంటని బాలయ్య ఎంత అడిగినా.. జక్కను అస్సలు బయటపెట్టలేదు. పుల్​ ఫన్​గా సాగిన ఈ ఎపిసోడ్​లో జక్కన్న కెరీర్​లో ఎదుర్కున్న ఇబ్బందులు, ఇక్కడివరకు ఎలా ఎదిగారన్న విషయాలన్నీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్​ ఆహాలో ట్రెండింగ్​లో నడుస్తోంది.

    Also Read: ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ పవన్ కళ్యాణే