Warangal: వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరు.. నేతల మధ్య కానరాని సఖ్యత

Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిలికి చిలికి గాలివానలా మారిన గొడవలు ఇప్పుడు పార్టీకే నష్టాలు తెచ్చేలా ఉన్నాయి. దీంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గ్రూపు రాజకీయాలతో నేతల మధ్య పొరపొచ్చాలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య పోరులో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది పరిస్థితి. ఒకరికొకరు ఎత్తుగడలు వేస్తూ తమ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నారు. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన బస్వరాజు సారయ్య, మాజీ రాజ్యసభ […]

Written By: Srinivas, Updated On : December 18, 2021 7:23 pm
Follow us on

Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిలికి చిలికి గాలివానలా మారిన గొడవలు ఇప్పుడు పార్టీకే నష్టాలు తెచ్చేలా ఉన్నాయి. దీంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గ్రూపు రాజకీయాలతో నేతల మధ్య పొరపొచ్చాలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య పోరులో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది పరిస్థితి. ఒకరికొకరు ఎత్తుగడలు వేస్తూ తమ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నారు.

Warangal

నియోజకవర్గంలో గతంలో పనిచేసిన బస్వరాజు సారయ్య, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి ప్రస్తుతం మేయర్ గా ఉన్న గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ఎవరికి వారే రాజకీయాలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం కాకుండా చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి సమస్యలు పెరుగుతున్నాయి.

నేతల్లో సఖ్యత కానరాకపోవడంతో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. ఎమ్మెల్యే నరేందర్, మేయర్ సుధారాణి మధ్య గొడవలు ముదిరిపోయాయి. దీంతో మేయర్ ఎమ్మెల్యే అనుచరులైన కార్పొరేటర్లకు పనులు ఇవ్వడం లేదని బహిరంగంగా ఆరోపిస్తున్నారు తమ మనుగడ ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు వారి ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు ఉన్నా వారికి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో వారు మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: KCR vs BJP: కేసీఆర్.. బీజేపీని ఓడించగలడా?

గతంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్యకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో నియోజకవర్గంపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు ఇదే నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నేతల మధ్య దూరం పెరిగిపోతోంది. ఫలితంగా పార్టీ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని విధంగా మారిపోతోంది. దీనిపై సీఎం ఏ మేరకు దృష్టి సారించి నేతల మధ్య సఖ్యత తీసుకొస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: Inter board: ఇంటర్ బోర్డు నిర్వాకం.. విద్యార్థులకు శాపం.. తగ్గిన ఉత్తీర్ణత శాతం

Tags