Shyam Singha Roy: శ్యామ్ ​సింగరాయ్ ​సెన్సార్​ టాక్​ ఎలా ఉందంటే?

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై భారీగా అంచనాలు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 18, 2021 7:52 pm
Follow us on

Shyam Singha Roy: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్​, కృతి శెట్టి హీరోయిన్​లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుసగా వచ్చిన సినిమాల్లో పెద్దగా హిట్​ సాధించలేని నాని.. ఈ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమా హిట్ కావడం నానికి చాలా అవసరం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, సినిమా చాలా స్లోగా ఉందని టాక్​. చాలా వరకూ బెంగాలీ భాషను చూపించడం.. మైనస్​ అంటున్నారు. తెలుగువారికి నచ్చకపోయే ప్రమాదం ఉందని అంచనా.

అయితే, సెన్సార్ చెప్పిన మాటలు రివర్స్ అయ్యి భారీ హిట్​ కొట్టిన సినిమాలూ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో నానితో పాటు సాయిపల్లవి కోసం వచ్చే ప్రేక్షకులు కూడా ఉన్నారు.ముందుగానే సాయిపల్లవికి లక్కీ హీరోయిన్​ అనే పేరు కూడా ఉంది. మరి శ్యామ్​ సింగరాయ్ సెన్సార్ టాక్​ను అధిగమించి  ఏమేరకు విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే డిసెంబరు 24 వరకు వేచి చూడాల్సిందే.​ ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.