https://oktelugu.com/

Rajamouli : యూట్యూబ్ ను షేక్ చేస్తున్న రాజమౌళి… కారణం ఏంటి..?

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారిలో రాజమౌళి ఒకరు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రేక్షకులందరిలో ఒక క్రేజ్ ను క్రియేట్ చేస్తుంది. ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది పక్కాగా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 7, 2024 / 08:06 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి… తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో అద్భుతాలను చేస్తుంది అంటే దానికి ముఖ్య కారణం రాజమౌళి అనే చెప్పాలి. ఆయన బాహుబలి సినిమాను తీసి మనం కూడా భారీ సినిమాలను తీసి సక్సెస్ చేయగలం అని ప్రూవ్ చేశాడు. కాబట్టే ఆ తర్వాత నుంచి మన దర్శకులు అందరూ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో భారీ తారగణం అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో రాజమౌళి సినిమాలకి యూట్యూబ్ లో చాలా ఎక్కువ గిరాకీ పెరుగుతుంది. ఆయన నుంచి వచ్చిన ఇంటర్వ్యూ గాని, ఆయన ఇంతకుముందు ఇచ్చిన స్పీచ్ లు గానీ ప్రతీది భారీ వ్యూస్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. కారణం ఏంటి అంటే రాజమౌళి అనే పేరుకి ఇప్పుడు ఇండియాలో ఒక ప్రత్యేకమైన ఆదరణ అయితే ఉంది.

    స్టార్ హీరోలు ఎలాంటి రేంజ్ అయితే పొందుతున్నారో రాజమౌళికి కూడా అలాంటి ఒక రేంజ్ అయితే ఉందనే చెప్పాలి. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా కూడా ఆయన అభిమానులు తనకి నీరాజనాలు పడుతూ ఉంటారు. స్టార్ హీరోల కంటే కూడా ఇప్పుడు రాజమౌళి స్టార్ డమ్ అనేది ఎక్కువగా విస్తరిస్తూ వస్తుంది.

    ప్రతి ఒక్క హీరో రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో… ప్రస్తుతం రాజమౌళి తలుచుకుంటే సాధారణ హీరోని సైతం పాన్ ఇండియా హీరోగా మార్చగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడి గా గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాలు ఆయన పడుతున్న కష్టం వల్లే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడనేది మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.

    ఒక సినిమా మీద ఆయన ఫోకస్ చేశాడు అంటే పని రాక్షసుడిలా సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ కష్టమే ఈరోజు అతనికి అంత పెద్ద స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి… మరి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది చూడడానికే ఇప్పుడు ప్రపంచం అంతా అసక్తి గా ఎదురుచూస్తుంది…