Site icon OkTelugu

Konda Surekha : కాంగ్రెస్ మంత్రులు కొండా సురేఖని వెనకేసుకొస్తూ చేస్తున్న వాదనలు సహేతుకమేనా?

Revanth Reddy Konda Surekha Nagarjuna

Revanth Reddy Konda Surekha Nagarjuna

Konda Surekha : అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఇప్పటికి ఇది జరిగి వారం కావస్తోంది. సమస్య సమసిపోకపోగా.. రోజురోజుకు పెద్దది అవుతోంది. ఈరోజు హీరో నాగార్జున కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణకు వచ్చింది.. రేపు స్వయంగా హీరో నాగార్జున వాంగ్మూలం కూడా ఇవ్వబోతున్నాడు. హీరో నాగార్జున ప్లేసులో ఎవరున్నా అదే చేస్తారు. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా ఇదే చేస్తారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై చిత్రపరిశ్రమ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకుంటానని చెప్పుకొచ్చింది. కానీ క్షమాపణలు చెబుతున్నట్టు మాత్రం సురేఖ అనలేదు. అంత పెద్ద పేరున్న హీరోపై ఇంత గలీజు ఆరోపణలు ఎవరూ చేయలేదు. క్షమాపణ చెప్పకపోగా.. సురేఖకు మద్దతుగా మంత్రులు బయటకు రావడం జుగుప్సాకరంగా ఉంది. మంత్రులు సురేఖకు మద్దతు ఇవ్వడం.. రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండడం చాలా దారుణమనే చెప్పాలి.

కొండా సురేఖ ఒక బిసీ మహిళా మంత్రి అంటూ తోటి మంత్రులు వెనకేసుకురావడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. బీసీ మహిళ అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏం మాట్లాడినా చెల్లుతుందా? ఆమె మాట్లాడిన మాటలు.. ఓ మహిళా మంత్రి ఇలా మాట్లాడడం దారుణాతి దారుణమనే చెప్పాలి. కొండా సురేఖకు జరిగింది అన్యాయమే.. ట్రోల్ చేయడం తప్పు. కానీ సురేఖకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఈవిడ బాధ్యత గల వ్యక్తి. తెలంగాణ సమాజానికి ప్రతినిధి ఈమె..

కాంగ్రెస్ మంత్రులు కొండా సురేఖని వెనకేసుకొస్తూ చేస్తున్న వాదనలు సహేతుకమేనా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Exit mobile version