Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి (Rajamouli) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ వరల్డ్ (Pan World) సినిమాని కూడా స్టార్ట్ చేసి ఆ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు (Mahesh Babu) ని ఈ సినిమా కోసం ఎంచుకొని ఒకరకంగా సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తన కంటెంట్ మీదున్న కాన్ఫిడెంట్ తో రాజమౌళి ఈ సినిమాని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడకుండా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రహస్యంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని విపరీతంగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలావరకు సాహసోపేతమైన సన్నివేశాలైతే ఉన్నాయట. దానికోసం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుతో రియల్ స్టంట్స్ ని కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ఒరిజినల్ స్టంట్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట…ఇక దాని కోసమే ఇప్పుడు చాలా కసరత్తులను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిప్పుతో కూడిన ఫైట్ ఒకటి ఉండబోతుందట. అందులో మహేష్ బాబు కొన్ని షాట్స్ లో నిప్పుతో స్టంట్స్ చేయడానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు చాలా సమయాల్లో ఎక్కువగా డూప్ లను వాడి ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సందర్భంలో ఫైర్ తో ఫైట్ అంటే ఒక రకంగా కొంతవరకు రిస్కీతో కూడినప్పటికి రాజమౌళి ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఫైట్ అయితే షూట్ చేస్తాడు. కానీ ఒక రకంగా ఫైర్ లో ఫైట్ చేయాలి అంటే మాత్రం మహేష్ బాబుకు కొంతవరకు ఇబ్బంది ఎదురవ్వచ్చు…
ఎందుకంటే ముందే సెన్సిటివ్ గా ఉండే మహేష్ బాబు అలాంటి ఫైట్ ను చేస్తాడా లేదా అని కొంతమంది కొన్ని కామెంట్లను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడాల్సిన సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి…