Pawan kalyan- Rajamouli: స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట. అన్నీ కుదిరితే పవన్ తో రాజమౌళి మూవీ చేయడం ఖాయం అంటున్నారు. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ప్రతి స్టార్ ఫ్యాన్స్ తమ హీరో రాజమౌళితో మూవీ చేయాలని కోరుకుంటారు. ఆయనతో సినిమా చేసిన ప్రతి హీరో తన పేరిట బాక్సాఫీస్ రికార్డ్స్ నమోదు చేసుకుంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్, పవన్, అల్లు అర్జున్ లతో రాజమౌళి చిత్రాలు చేయలేదు. బాహుబలి తర్వాత ఆయన ఒక్కో చిత్రానికి రెండు మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరు స్టార్స్ తో సినిమాలు చేయడం సాధ్యం కావడం లేదు.

కాగా మహేష్ తో మూవీ కుదిరింది. ఈ విషయాన్ని రాజమౌళి, మహేష్ ధృవీకరించారు. స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ ఫ్యాన్స్ కల కూడా తీరుతున్న తరుణంలో పవన్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ పై ప్రత్యేక అభిమానం కలిగిన విజయేంద్ర ప్రసాద్ ఆయన కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నారట. ఆ కథను రాజమౌళి దర్శకత్వంలో పవన్ చేయాలని భావిస్తున్నారట.
Also Read: Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన సగం యాపిల్ అప్పట్లో ఎన్ని కోట్ల రూపాయిలకు కొన్నారో తెలుసా..?
అన్నీ కుదిరితే మహేష్ మూవీ తర్వాత రాజమౌళి చేసేది పవన్ కళ్యాణ్ తోనే అంటున్నారు. మరి ఇదే నిజమైతే బాక్సాఫీస్ షేక్ కావలసిందే. గతంలో మీరు పవన్ తో మూవీ ఎందుకు చేయలేదని రాజమౌళిని అడగడం జరిగింది. ఓసారి ఆయన్ని కలిసి నేను కథ వినిపించాను. పవన్ త్వరలో మూవీ చేద్దాం అన్నారు. తర్వాత ఇద్దరం ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయ్యాం. దానితో కుదరలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో రిపీటెడ్ గా సినిమాలు చేసిన రాజమౌళి.. మిగతా స్టార్స్ తో ఒక్క మూవీ కూడా చేయకపోవడం గమనార్హం.

మరోవైపు పవన్ ఫ్యాన్స్ పాన్ ఇండియా ఆశలు హరి హర వీరమల్లుతో తీరనున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు కలవు.
Also Read:Singer KK: కోట్లు ఇచ్చినా ఆ పని చెయ్యను అని తెగేసి చెప్పిన Kk
[…] Also Read: Pawan kalyan- Rajamouli: పవన్ తో రాజమౌళి మూవీ? కథ సిద్… […]
[…] Also Read: Pawan kalyan- Rajamouli: పవన్ తో రాజమౌళి మూవీ? కథ సిద్… […]