Silk Smitha: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మకుటం లేని మహారాణి లాగ ఒక్క వెలుగు వెలిగిన నటి సిల్క్ స్మిత..తన అందచందాలతో ఆమె అప్పటి తరం వారినే కాదు..నేటితరం వారిని కూడా ఆకట్టుకుంటుంది..ఆమెకి సంబంధించిన వీడియో సాంగ్స్ మరియు సన్నివేశాలు ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి..అప్పట్లో సిల్క్ స్మిత సినిమాలో ఉంది అంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు దర్శక నిర్మాతలు..అందుకే ఆరోజుల్లో సిల్క్ స్మిత కి సంబంధించిన పాట లేని సినిమాలు చేతివేళ్ళతో లెక్కపెట్టవచ్చు..అప్పట్లో కేవలం సిల్క్ స్మిత కోసమే థియేటర్స్ కి క్యూ కట్టే యువతరం ఉండే వాళ్ళు..తనకి ఉన్న డిమాండ్ ని సరిగ్గా ఉపయోగించుకొని అన్ని ప్రాంతీయ బాషలలో ఒక్క వెలుగు వెలిగింది సిల్క్ స్మిత..అలాంటి అమ్మాయి నిర్మాతగా మారి సినిమాలు తీసి అప్పుల ఊబిలో చిక్కుకొని చివరికి ఆత్మహత్య చేసుకుని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది..ఆమె జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని విద్యాబాలన్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అప్పట్లో సిల్క్ స్మిత గారి క్రేజ్ ఎలా ఉండేది అనే దానికి ఉదాహరణ గా ఇప్పుడు మనం ఒక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాము..అప్పట్లో ఆమె సగం కొరికి పారేసిన యాపిల్ ని వేలం వేశారు..ఆ యాపిల్ ని కొనుగోలు చెయ్యడానికి అప్పట్లో అభిమానులు ఎగబడ్డారు కూడా..అలా ఆమె సగం కొరికిన యాపిల్ ని ఒక్క అభిమాని అక్షరాలా లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన సంఘటన అప్పట్లో సెన్సషనల్ గా మారింది.
Also Read: Senior NTR: ఒక్క సన్నివేశం కోసం మూడేళ్లు న్యాయపోరాటం చేసిన ఎన్టీఆర్
అప్పట్లో లక్ష రూపాయిలు అంటే నేడు కోటి రూపాయలతో సమానం అని చెప్పొచ్చు..సిల్క్ స్మిత గారికి క్రేజ్ కి ఇదొక్క ఉదాహరణ..పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కి సమీపం లో ఒక్క చిన్న గ్రామం లో పుట్టి పెరిగిన సిల్క్ స్మిత, కేవలం నాల్గవ తరగతి వరకే చదువుకుంది..చిన్నవయసులోనే తల్లి తండ్రులు తనకి పెళ్లి చేస్తున్నారు అని తెల్సుకొని ఇంటి నుండి పారిపోయాయి మద్రాసు కి వచ్చిన సిల్క్ స్మిత నేడు చిరస్థాయిగా ఇండియన్ సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది..టచ్ అప్ గర్ల్ గా ప్రారంభం అయినా ఆమె కెరీర్ కోట్లాది మంది అభిమానులను దక్కించుకునే వరుకు సాగిన ఆమె సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శమే.
Also Read:Naga Babu: జనసేనతో చిరంజీవి.. నాగబాబు క్లారిటీ.. ఏపీలో పొత్తులు ఎత్తులు