https://oktelugu.com/

Viral News: ఒకే బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చిన తల్లి.. అసలు విషయం తెలిస్తే షాక్

Viral News: సృష్టికి ప్రతిసృష్టి చేయడం ఆ దేవుడికే సాధ్యం. కానీ మనిషి అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ప్రతి ఒక్కరి పుట్టుక స్థితిని ఎవరూ మార్చలేరు.కానీ మన వైద్యులు మార్చి నిరూపించారు. అమెరికాలో ఓ తల్లి బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చింది. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. వైద్యశాస్త్రంలో జరిగిన అద్భుతంగా దీన్నీ కీర్తిస్తున్నారు. మొదట 6 నెలలకే కడుపులోని బిడ్డ పరిస్థితి బాగా లేకపోవడంతో వైద్యులు కడుపులోంచి బయటకు తీశారు. ఆ తర్వాత చికిత్స చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2022 / 12:22 PM IST
    Follow us on

    Viral News: సృష్టికి ప్రతిసృష్టి చేయడం ఆ దేవుడికే సాధ్యం. కానీ మనిషి అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ప్రతి ఒక్కరి పుట్టుక స్థితిని ఎవరూ మార్చలేరు.కానీ మన వైద్యులు మార్చి నిరూపించారు. అమెరికాలో ఓ తల్లి బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చింది. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. వైద్యశాస్త్రంలో జరిగిన అద్భుతంగా దీన్నీ కీర్తిస్తున్నారు.

    మొదట 6 నెలలకే కడుపులోని బిడ్డ పరిస్థితి బాగా లేకపోవడంతో వైద్యులు కడుపులోంచి బయటకు తీశారు. ఆ తర్వాత చికిత్స చేసి మళ్లీ లోపల ప్రవేశపెట్టారు. 11 వారాల తర్వాత ఆ తల్లి మరోసారి అదే పాపకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఈ తల్లి ఒకే బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఫ్లోరిడాకు చెందిన జాడెన్ ఆష్లే అనే వ్యక్తి కడుపులో ఉన్న శిశువుకు వెన్నుముక సమస్య ఉందని తెలిసింది. అది సరిదిద్దకపోతే పాప ప్రాణం పోతుందని తెలిసింది. దీని తర్వాత జేడెన్ ప్రత్యేక వైద్యుల బృందాన్ని సంప్రదించింది. ఆ డాక్టర్లు ఇంకా పూర్తిగా డెవలప్ కాని మగబిడ్డను తల్లిగర్భం నుంచి తీసి ఆపరేషన్ చేసి మళ్లీ తల్లి కడుపులో ఉంచారు. కడుపులో ఉండగానే ఆ చిన్నారి వెన్నెముకలో సమస్య ఉందని.. పుట్టకముందే వైద్యులు ఆపరేషన్ చేశారు. 2 నెలల తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసి తిరిగి అదే శిశువును బయటకు తీవారు. వెన్నుపూజ సరిదిద్దేందుకు ఆ బిడ్డను రెండు సార్లు డెలివరీ చేశారు.

    6 నెలలకు ఆ తల్లి నుంచి బిడ్డను డెలివరీ చేసిన వైద్యులు మరోసారి రెండు నెలల తర్వాత ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఈ పాప వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలను వైద్యులు తమ పర్యవేక్షణలోనే ఉంచారు. తర్వాత ఆరోగ్యం బాగుండడంతో ఇద్దరినీ ఇంటికి పంపారు.

    సోషల్ మీడియాలో ఈ వీడియోను జేడెన్ పంచుకోవడంతో అదిప్పుడు వైరల్ గా మారింది. బిడ్డ పుట్టిన తర్వాత వైకల్యంతో జీవితాంతం బాధపడేకంటే ముందే గుర్తించి కడుపులోనే సరిచేసి ఆ పిల్లలకు ఊపిరిపోయడం నిజంగా గ్రేట్ అని వైద్యులను అభినందిస్తున్నారు. కడుపులోనే లోపాలను సరిదిద్ది సంచలనం సృష్టించారు. నిపుణులైన వైద్య బృందం ఈ కష్టమైన ఆపరేషన్ ను చేసి సృష్టికి ప్రతిసృష్టి చేశారు.

     

    Tags